Sriya Reddy : నాలుగు పదుల వయసులో కూడా సెగలు పుట్టిస్తున్న సలార్ బ్యూటీ?

సౌత్ సినీ ఇండస్ట్రీలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్రియా రెడ్డి ( Sriya Reddy ) ఒకరు.ఈమె దాదాపు 18 సంవత్సరాల క్రితం తెలుగులో అప్పుడప్పుడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Salaar Actress Sriya Reddy Looks Hot In Her Latest Pics-TeluguStop.com

ఆ తర్వాత అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించారు.ఇక ఈ సినిమాల తర్వాత పూర్తిగా టాలీవుడ్ కి దూరమైనటువంటి శ్రియ రెడ్డి తిరిగి 18 సంవత్సరాల తర్వాత మరోసారి టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి విక్రమ్ కృష్ణ( Vikram Krishna ) ను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు కూడా గుడ్ బై చెప్పి విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు .ఇలా విదేశాలలో ఉన్నటువంటి శ్రియా రెడ్డి ఇటీవలే ఇండియాకి వచ్చారు.ఇండియా వచ్చినటువంటి ఈమె తిరిగి సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టారు.ఈ క్రమంలోనే వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

ఇకపోతే ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సలార్ సినిమా ( Salaar Movie ) ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే .ఈ సినిమాలో శ్రియ రెడ్డి కీలకపాత్రలో కనిపించి సందడి చేశారు.ఈ సినిమా తర్వాత ఈమెకు మరిన్ని సినిమాలలో అవకాశాలు కూడా వస్తున్నాయి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా( OG Movie )లో కూడా నటిస్తున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీ అయినటువంటి శ్రీయ రెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈమె బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇలా నాలుగు పదుల వయసులో ఉన్నటువంటి శ్రియా రెడ్డి పెద్ద ఎత్తున గ్లామర్ షో( Glamor Show ) చేస్తూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వేసవి తాపం పెంచుతున్నారు.ఇలా ఈమె అందాలన్నింటినీ ఆరబోస్తూ సెగలు పుట్టిస్తున్నటువంటి తరుణంలో ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.అసలు ఈ ఫోటోలలో ఉన్నది శ్రీయా రెడ్డేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube