పవన్ 'ఓజి'పై సలార్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలా ఉంటుందంటూ..

పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న ”సలార్” డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.దీంతో ఈ నెల మొత్తం సలార్ మేనియా నడుస్తుంది.

 'salaar' Actress Sriya Reddy Interesting Comments On Og Movie, Sriya Reddy, Di-TeluguStop.com

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘‘సలార్’‘( Salaar ).ఈ సినిమాతో ఎట్టకేలకు డార్లింగ్ ఖాతాలో అయితే హిట్ పడింది.మరి ఈ సినిమాలో కీలక రోల్ లో శ్రీయ రెడ్డి నటించిన విషయం తెలిసిందే.ఈ భామ ఈ సినిమాలో రాధా రమ మన్నార్ పాత్రతో ఆడియెన్స్ ను తన వైపు తిప్పుకుంది.

ఇక ఈ పాత్రను ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ”ఓజి” ( OG Movie ) సినిమాలో తన రోల్ ఎలా ఉండబోతుందో చెప్పి మరింత క్యూరియాసిటీ పెంచేసింది.ఈ సినిమాలో ఈ భామ తన రోల్ సినిమాకు కీలకం అని అయితే ఇది నెగిటివ్ రోల్ కాదని ఈ రోల్ కూడా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చింది.

అలాగే ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ అంత ఈ సినిమాను మెచ్చేలా డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఇక పవర్ స్టార్ నటన అదిరిపోతోందని ఓజి టీమ్ తో పని చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఈమె చెప్పుకొచ్చింది.ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారుకాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.

డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube