ప్రశాంత్ నీల్( Prashanth Neil ) డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న సలార్ కూడా రెండు పార్ట్ లుగా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ను హోంబలె ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృధ్వి రాజ్ సుకుమారన్ ( Prithvi Raj Sukumaran )విలన్ గా నటిస్తున్నాడు.అయితే సలార్ పార్ట్ 1 పుష్ప తరహా లో విలన్ చివర్లో ట్విస్ట్ ఇస్తాడని తెలుస్తుంది.
పుష్ప 1లో హీరో కి చెక్ పెట్టేందుకు SP గా ఫహాద్ ఫాజిల్ చివర్లో ఎంట్రీ ఇస్తాడు.సలార్ 1 లో కూడా అలానే పార్ట్ 1 చివర్లోనే విలన్ ఎంట్రీ ఉంటుందట.
సో అలా చూస్తే సలార్ 1 కూడా పుష్ప రేంజ్ లో కాదు కాదు దాన్ని మించి హిట్ అవుతుందని చెప్పొచ్చు.బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ కి తగ్గ సినిమా ఒక్కటి కూడా పడలేదు.
సాహో, రాధే శ్యాం, ఆదిపురుష్ ఈ మూడు సినిమాలతో ఫ్యాన్స్ కి సరైన సినిమా అందించలేని ప్రభాస్ సలార్ 1 తో వారి ఆకలి తీర్చాలని చూస్తున్నాడు.మరి సలార్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ ఫిక్స్ చేయగా సలార్ 2 2024 చివర్లో ఉంటుందని తెలుస్తుంది.







