సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ కామెంట్లు..!!

Sajjala Ramakrishna Reddy's Serious Comments , Sajjala Ramakrishna Reddy, CBI, Avinash Reddy

ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.

 Sajjala Ramakrishna Reddy's Serious Comments , Sajjala Ramakrishna Reddy, Cbi,-TeluguStop.com

వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి మాట్లాడుతూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.విషయంలోకి వెళ్తే సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు నవీన్ గురించి పచ్చ మీడియా ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.“వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో జగన్ దగ్గర ఫోన్ లేకపోవడంతో.అవినాష్ రెడ్డి నవీన్ కీ కాల్ చేశారు.

అందులో తప్పేముంది.

Telugu Avinash Reddy-Telugu Political News

ఈ క్రమంలో సిబిఐ అవినాష్ రెడ్డి కాల్ లిస్ట్ ప్రకారం విచారణ చేస్తే… నవీన్ సిబిఐ విచారణకు హాజరయ్యాడు.అసలు ఇందులో తప్పు పట్టడానికి ఏముందని సజ్జల ప్రశ్నించారు.కావాలని తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని చానల్స్.

సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు నవీన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.అంతేకాదు అవినాష్ రెడ్డి ఫోన్ ను గతంలోనే పోలీసులు చెక్ చేశారని సజ్జల తెలియజేశారు.

ఈ క్రమంలో నాలుగు రోజుల నుంచి పచ్చ మీడియా కుట్ర కోణం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.చంద్రబాబు చేసే నీచ రాజకీయాలలో ఇదొక భాగమని సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube