కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ జేఏసీ నాయకులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డి సమాశేం అయ్యారు.వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలులో ఉద్యోగం, ఉపాధ్యా, ప్రజా సంఘాలు మద్దుతు ఇస్తున్నాయని ఏపి సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
కర్నూలు నగర శివారులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్ధి, విద్య సంస్థల జేఏసి నాయకులు ఏపి సలహదారులు సజ్జలను కలిశారు.రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ కు కట్టుబడి ఉందని, వికేంద్రీకరణ అడుగులు వేస్తుందని సజ్జల రామకృష్ణరెడ్డి తెలిపారు.
అమరావతికే తెలుగు దేశం పార్టీ నేతలు మద్దతు ఇస్తూ, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రానికి 3 రాజధానులు ఉత్తర ఆంధ్ర, రాయలసీమ కు చాలా అవసరమని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు.
న్యాయ రాజధాని కోసం డిసెంబర్ 5వ తేదీన వికేంద్రీకరణ, న్యాయ రాజధాని గొంతు బలంగా వినిపిస్తుందన్నారు.కర్నూలు జిల్లాలోని న్యాయవాదులు, విద్యార్థి యువజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు పూర్తి మద్దతు ఇస్తున్నారని, ఈ వేదిక కర్నూలు నగరంలోని ఎస్టిబిసి కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రజల్లో చైతన్యం కలిగించి, ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.వికేంద్రీకరణ ను అడ్డుకునే వ్యక్తులపై ఈ సభతో సమాధానం కావాలన్నారు.