ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను వైసీపీ ప్రభుత్వం( YCP Government ) చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.
నేతలను నిత్యం ప్రజలలో ఉండే రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఒకపక్క ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు ఆగిపోకుండా.
లబ్ధిదారులకు చేరవేస్తున్నారు.అదేవిదంగా గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతానికి పైగా వైఎస్ జగన్( YS Jagan ) నెరవేర్చడం జరిగింది.
ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్ లు.జిల్లా అధ్యక్షులు సమావేశంలో.సజ్జల మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచే సత్తా వైసీపీకీ ఉందని స్పష్టం చేయడం జరిగింది.
ఇక ఇదే సమయంలో ఓటర్ల జాబితా సవరణలు అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.దొంగ ఓట్ల తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో చురుగ్గా ఉండాలి.
ఇదే సమయంలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచి కూడా ఇంటింటికి అర్థమయ్యే రీతిలో వివరించాలి.అంతేకాదు వాలంటీర్ల పై ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లను కూడా తిప్పి కొట్టాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి( YCP Sajjala Ramakrishna Reddy ) పేర్కొన్నారు.