రాష్ట్ర ప్రజల మూడు రాజధానుల ఆకాంక్ష నేరవేరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేందాలని, సుభిక్షంగా ఉండాలని స్వామి వారి వేడుకోవడం జరిగిందని, కష్టాల కాలంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంను అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారని, ఏపికి రాష్ట్రంకు రావాల్సినవి అన్ని రావాలని, రాష్ట్ర ప్రజల మూడు ప్రాంతాల అభివృద్ధి ఆంక్ష, అధికార వికేంద్రీకరణ మూడు రాజధానులకు ఆటంకాలు తొలగి పోవాలని, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఎప్పటికైనా ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నట్లు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.







