ముంబై నటి వేధింపుల కేసు : వారిపై 'సజ్జల' పరువు నష్టం దావా

గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్న ముంబై నటి కాదాంబరి జత్వాని( Mumbai Actress Kadambari Jatwani ) వ్యవహారంలో వైసిపి నేతలను టార్గెట్ చేసుకుని టిడిపి కూటమి నేతలు అనేక విమర్శలు చేస్తున్నారు.

  ముఖ్యంగా ఈ విషయంలో వైసిపి ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) పేరు పదేపదే ప్రస్తావనకు వస్తోంది.

  అంతేకాకుండా కొంతమంది ఐపీఎస్ అధికారుల పైన కేసులు నమోదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుందనే వార్తలు గత కొద్ది రోజులుగా వస్తూనే ఉన్నాయి.తాజాగా వైసిపి నేత కుక్కల విద్యాసాగర్( Kukkala Vidyasagar ) అనే వ్యక్తి పై ముంబై నటి కాదాంబరి జత్వాని అనేక ఆరోపణలు చేసింది.

కుక్కల విద్యాసాగర్ తనను అనేక ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపిస్తూ గత వైసిపి ప్రభుత్వం లోని కొంతమంది పెద్దలు , పోలీస్ అధికారుల పాత్ర ను ఆమె ప్రస్తావించింది.

ఈ విషయం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది .ఇక మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వీటి పై వచ్చాయి.  తాజాగా ఈ వ్యవహారం విజయవాడ పోలీసులు వద్దకు చేరింది.

Advertisement

  విజయవాడ సిపిని కలిసిన కాదాంబరి జత్వాన్ని తనపై వేధింపులు జరిగాయి అంటూ అనేక ఆధారాలు అందజేశారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే కాదాంబరి  జత్వాని వ్యవహారం లో పదేపదే తన పేరు ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముంబై నటి చేస్తున్న ఆరోపణల వ్యవహారంలో తన పేరు ప్రస్తావనకు తీసుకు వస్తుండడం తో  ఆయన లీగల్  చర్యలకు దిగారు. ముంబై నటికి వేధింపులు సజ్జల సహాయం పేరుతో ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ తనపై దుష్ప్రచారం చేశారంటూ ఆ పత్రిక పైన విమర్శలు చేశారు.

ఆ కథనం ఆధారంగా టిడిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య పైన పరువు నష్టం దావా వేశారు.ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించారు.ఏపీలో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని సజ్జల విమర్శించారు.

  తనను అప్రతిష్ట పాలు చేసేందుకు ఆ నటిని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపిందని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?
Advertisement

తాజా వార్తలు