భాష ఏదైనా యాస ఏదైనా అలవోకగా మాట్లాడి మెప్పించే టాలెంట్ కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది.అలాంటి టాలెంట్ కలిగి ఉన్న నటీమణులలో సాయిపల్లవి( Sai Pallavi ) ఒకరు.
సాయిపల్లవి ఫిదా సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు.సినిమాను అనుగుణంగా లుక్ ను మార్చుకుంటూ న్యాచురల్ గా కనిపించడానికి ఇష్టపడే సాయిపల్లవికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఫిదా సినిమాలో తెలంగాణ యాస( Telangana Slang )లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సిక్కోలు యాస( Srikakulam Slang )లో అదరగొడుతున్నారు.పుట్టింది తమిళనాడులో అయినా సాయిపల్లవి టాలెంట్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.
ఈసారి సిక్కోలు యాసలో డైలాగ్స్ పలకనున్న ఈ బ్యూటీ ఆ డైలాగ్స్ తో ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.ప్రస్తుతం సిక్కోలు యాసలో ఆమె శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
సాయిపల్లవికి ఏ భాషనైనా నేర్చుకోవడం అంటే ఎంతో ఇష్టమని కొత్తకొత్త యాసలలో మాట్లాడటం ఎంతో ఇష్టమని భోగట్టా. సాయిపల్లవి రెమ్యునరేషన్( Sai Pallavi Remuneration ) పరంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు.చాలామంది హీరోయిన్లలా ఇష్టానుసారం రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం లేదు.సాయిపల్లవికి సరైన ఆఫర్లు రాలేదు వచ్చి ఉంటే ఆమె రేంజ్ వేరేలా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సాయిపల్లవికి పాన్ ఇండియా స్థాయి హీరోయిన్ గా గుర్తింపు ఉండటంతో పాటు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు.సినిమా కోసం ఈ బ్యూటీ ఎంత కష్టమైనా పడతారు.సాయిపల్లవి డ్యాన్సింగ్ స్కిల్స్ ను సరిగ్గా వాడుకునే దర్శకనిర్మాతలు సైతం చాలా తక్కువమంది ఉన్నారు.తండేల్ సాయిపల్లవికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది.సాయిపల్లవి వేగంగా ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.భవిష్యత్తులో ఆఫర్లు తగ్గిన తర్వాత ఈ బ్యూటీ డాక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తారని తెలుస్తోంది.