ఇటీవల కాలంలో ఇ-కామర్స్ సైట్‌లలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి.వేలు, లక్షల రూపాయలు చెల్లించి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తున్న కస్టమర్లకు కోలుకోలేని షాక్ తగులుతోంది.
ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తే, తమకు ఇటుకలు డెలివరీ చేశారని కొందరు బాధితులు తరచూ గగ్గోలు పెడుతున్నారు.అయితే సమస్యను పరిష్కరించాల్సి ఇ-కామర్స్ సైట్‌లు మాత్రం చేతులెత్తేస్తున్నాయి.
దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కస్టమర్లు చిక్కుకుపోతున్నారు.తాజాగా అలాంటి ఓ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో( Ghaziabad ) వెలుగు చూసింది.
ఓ వ్యక్తి తనకు నచ్చిన స్మార్ట్ ఫోన్ కొంచెం డిస్కౌంట్‌లో తక్కువకే ఫ్లిప్‌కార్ట్‌లో( Flipkart ) ఉండడం చూశాడు.
దీంతో వెంటనే డబ్బులు చెల్లించాడు.
అనంతరం కొన్ని రోజులకు తనకు వచ్చిన డెలివరీ చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఇ-కామర్స్ సైట్‌లలో తరచూ మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.అయితే కొందరు బాధితులకు మాత్రమే సమస్య పరిష్కారం అవుతోంది.
తాజాగా యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.

ఆ వ్యక్తి మార్చి 28న ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22 వేల విలువైన స్మార్ట్‌ఫోన్‌ను( Smart Phone ) ఆర్డర్ చేశాడు.ఆశ్చర్యకరంగా ఆ స్మార్ట్ ఫోన్ అదే రోజు సైట్ ద్వారా అతడికి అందించబడింది.
తీరా తనకు వచ్చిన పార్సిల్ తెరిచి చూశాక ఆ వ్యక్తి ఖంగుతిన్నాడు.అందులో 5జీ స్మార్ట్ ఫోన్ ఉందనుకుంటే ఆశ్చర్యకరంగా గులకరాళ్లు( Stones ) కనిపించాయి.
దీంతో వెంటనే ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులను ఆయన మెయిల్ ద్వారా సంప్రదించాడు.తనకు ప్రొడక్ట్ తప్పుగా వచ్చిందని, ఫోన్ ఆర్డర్ చేయగా గులకరాళ్లు వచ్చాయని తన ఆవేదనను తెలియజేశాడు.
అయితే సమస్య పరిష్కరించాల్సిన ఫ్లిప్‌కార్ట్ తాము ఏమీ చేయలేమని తేల్చి చెప్పేసింది.

దీంతో రూ.22 వేలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని బాధితుడు గగ్గోలు పెడుతున్నాడు.తనకు ఎదురైన సమస్యను వివరిస్తూ ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు.256 జీబీ ఇన్ఫినిక్స్ జీరో 30 5జీని( Infinix Zero 30 5G ) ఆర్డర్ చేసినట్లు స్క్రీన్‌షాట్ చూపిస్తుంది.అయితే, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఫ్లిప్‌కార్ట్, ఆర్డర్ వివరాలను పంచుకోవాలని కస్టమర్ కోరింది.
యూజర్‌కు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు చెప్పింది.సమస్య పరిష్కరిస్తామని చివరికి దిగి వచ్చి హామీ ఇచ్చింది.
అలాగే ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కస్టమర్లను ఫ్లిప్‌కార్ట్ కోరింది.ఇక ఇలాంటి ఘటనలు గతంలోనూ పలుమార్లు జరిగాయి.
ప్యాకేజీని అన్‌బాక్స్ చేసినప్పుడు కస్టమర్లు షాక్ అయ్యారు.ఖరీదైన వస్తువులకు బదులుగా రాళ్లను చూసి అవాక్కయ్యారు.







