బ్యాడ్మింటన్ లో పలురకాల మెడల్స్ ను భారతదేశానికి అందించినటువంటి స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ అందరికీ బాగానే గుర్తుంటుంది.అయితే గత కొద్ది కాలంగా అమ్మడు ఆటకు దూరంగా ఉంటోంది.
తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే ఫోజులతో ఫోటోలకు ఫోజ్ ఇస్తోంది.అంతేగాక ఇటీవల కాలంలో ఓ ప్రముఖ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని కొంతమేర గ్లామర్ డోస్ పెంచి ఫోజులిచ్చింది.
దీంతో అభిమానులు ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.ఎప్పుడు బ్యాడ్మింటన్ బ్యాట్ తో గ్రౌండ్ లో అదరగొట్టే ఈ అమ్మడు ఒక్కసారిగా అందంతో కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టిస్తోంది.
అయితే ఇది ఇలా ఉండగా గా సైనా నెహ్వాల్ అందానికి ఫిదా అయినటువంటి ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కూడా తన చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి ఓ పాత్రలో నటించేందుకు సంప్రదించాడట.అయితే ఆ పాత్రలో నటించేందుకు సైనా ఒప్పుకుందా లేదా అన్న విషయం పై ఎటువంటి స్పష్టత దర్శకుడు ఇవ్వడం లేదు.
అయితే సోషల్ మీడియాలో సైనానెహ్వాల్ గ్లామరస్ ఫోటోలు మాత్రం బాగానే వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ మధ్యనే సైనా నెహ్వాల్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో చేరారు.అంతేగాక ఇప్పటికే పార్టీకి అవసరమైన సమయంలో తన సేవలు అందిస్తారని కూడా చెప్పిన సంగతి తెలిసిందే.అయితే సైనా నెహ్వాల్ రాజకీయాల్లోకివెళ్ళినందువల్లే బాలీవుడ్ ఎంట్రీ రద్దయినట్లు కొంతమంది గుసగుసలాడుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై సైనా నెహ్వాల్ క్లారిటీ ఇచ్చేంతవరకు ఎంతవరకూ నిజమనేది తెలియడం లేదు.