మెగా హీరో సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) నటించిన కొత్త సినిమా “విరూపాక్ష” ( Virupaksha ) నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది.
ఈ సినిమాకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు.హర్రర్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు సాయిధరమ్ తేజ్ కెరియర్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
పైగా సాయి ధరమ్ తేజ్ జీవితంలో రోడ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నటించిన సినిమా కావటంతో… అభిమానులు సినిమా ఎలా ఉంటుందో అని చాలా టెన్షన్ పడ్డారు.
అంచనాలకు మించి సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవటంతో.ఫుల్ సంతోషంగా ఉన్నారు.ఈ పరిణామంతో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్ ని అభినందించారు.“వీరూపాక్ష అద్భుతంగా ఉందని టాక్ వచ్చింది.తేజ్ కమ్ బ్యాక్ ఇవ్వటంపై నేనెంతో సంతోషంగా ఉన్నా.
మీ సినిమాను ప్రేక్షకులు అభినందిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు… ఆనందంగా ఉంది.మొత్తం టీం కి హృదయపూర్వక అభినందనలు” అని ట్వీట్ చేశారు.దీనిపై తేజ్ స్పందిస్తూ.“థాంక్స్ మామ, అత్త… లవ్ యు బోత్” అని కామెంట్ చేయడం జరిగింది.