మెగా మేనల్లుడు సాయి తేజ్ ( Sai Tej )ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.ఆల్రెడీ ఈ ఏడాది విరూపాక్షతో ప్రేక్షకులను అలరించిన సాయి తేజ్ జూలైలో బ్రో సినిమాతో మరోసారి ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు.
ఇక బ్రో తర్వాత సాయి తేజ్ చేస్తున్న సినిమా సంపత్ నంది( Sampath Nandi ) డైరెక్షన్ లో వస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా అఖిల్ ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యాని తీసుకున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను ఆగష్టు లో మొదలు పెట్టి అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట.
కుదిరితే నవంబర్ పోస్ట్ ప్రొడక్షన్ చేసి డిసెంబర్ నెలలో కానీ జనవరిలో కానీ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట.ఆల్రెడీ సంక్రాంతికి సినిమాలు ఫుల్ అయ్యాయి కాబట్టి జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో సాయి తేజ్, సంపత్ నంది సినిమా ఉంటుందని చెప్పొచ్చు.బ్రోతో సాయి తేజ్ మరో హిట్ పక్కా కొడతాడని తెలుస్తుండగా సంపత్ నంది సినిమా మాత్రం మాస్ అండ్ కమర్షియల్ మూవీగా వస్తుంది.
కొన్నాళ్లుగా సరైన ఛాన్స్ లు లేక ఖాళీగా ఉన్న సంపత్ నంది ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.