టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు మహేష్ బాబు.ఇది ఇలా ఉంటే ఇటీవలె ఈ సినిమా కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభం అయ్యింది.
ఈ మూవీని యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించనున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక సిస్టర్ రోల్ ఉంటుందని, సినిమా కథ మొత్తం ఒక సిస్టర్ క్యారెక్టర్ చుట్టు సాగుతుందని, అంతేకాకుండా సినిమాలో సిస్టర్ పాత్ర చాలా కీలకమైనది అని తెలుస్తోంది.దీంతో ఈ పాత్ర కోసం సాయి పల్లవిని పరిశీలిస్తున్నారట మూవీ మేకర్స్.అయితే ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
మరి సాయి పల్లవి మహేష్ బాబు సినిమాలో మహేష్ కి చల్లెలుగా నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి మరి.

ఇకపోతే త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాను ఆగస్టు 11,2023 లో విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్‌గా కనిపించనుంది.మహేష్ బాబు సినిమా విషయానికొస్తే గత ఏడాది తన తండ్రిని కోల్పోయిన మహేష్ బాబు నిదానంగా నెమ్మదిగా ఆ బాధ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే సినిమాలలో మళ్లీ బిజీ అవుతున్న విషయం తెలిసిందే.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ఈ లొకేషన్ లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మహేష్ బాబు.







