ఇండస్ట్రీ లో కొంతమంది హీరోయిన్లు అందం తో కాకుండా కేవలం తమకి ఉన్న టాలెంట్ తో అశేష ప్రేక్షాభిమానం పొందుతారు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి( Sai Pallavi ) ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ అనే డ్యాన్స్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న సాయి పల్లవి, ఆ తర్వాత మలయాళం లో ప్రేమమ్ చిత్రం లో హీరోయిన్ గా నటించి పెద్ద సక్సెస్ ని అందుకుంది.
ఈ సినిమా తర్వాత ఆమెకి టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘ఫిదా‘ చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.ఈ సినిమా తో ఆమె ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది.
అప్పట్లో ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం సాయి పల్లవి అని చెప్పుకునే వారు.ఆ రేంజ్ ఇమేజి ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత తెలుగు, తమిళం మరియు మలయాళం భాషల్లో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకోవడం మాత్రమే కాకుండా, తన నటన మరియు డ్యాన్స్ తో కోట్లాది మంది అభిమానం ని సొంతం చేసుకుంది.అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తున్నారంటే, ఆమె రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.ఇకపోతే రీసెంట్ సమయం లో ఆమెకి వరుసగా ఫ్లాప్స్ రావడం తో కాస్త గ్యాప్ ఇచ్చింది.అలా కొద్దిరోజులు గ్యాప్ తర్వాత ఆమె నాగ చైతన్య మరియు చందు మొండేటి కాంబినేషన్ లో గీత ఆర్ట్స్ తెరకెక్కిస్తున్న ‘తండేల్’ చిత్రం( Thandel ) లో హీరోయిన్ రోల్ ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సాయి పల్లవి 7 కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది అట.
అడ్వాన్స్ గా అప్పుడే ఆమె మూడు కోట్ల రూపాయిలను నిర్మాత అల్లు అరవింద్ నుండి అనుకుందట.ఈ సినిమాకి నాగ చైతన్య కేవలం 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకుంటున్నట్టు సమాచారం.ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం.గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘లవ్ స్టోరీ’( Love Story ) అనే చిత్రం తెరకెక్కింది.
ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూసాము.కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో విడుదలైన ఈ సినిమాకి 36 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ సినిమా కూడా సాయి పల్లవి డ్యాన్స్ వల్లే హిట్ అయ్యిందని ట్రేడ్ లో టాక్ ఉంది.అందుకే ఆమె ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందట.