సాయి పల్లవి( Sai pallavi ) ఎట్టకేలకు తెలుగు సినిమా లో నటించేందుకు ఓకే చెప్పింది.అదే జోష్ లో ఇకపై వరుసగా సినిమాలు చేస్తుందని అంతా ఆశిస్తున్నారు.
నాగ చైతన్య తో రెండో సారి జత కట్టబోతున్న సాయి పల్లవి తదుపరి సినిమా విషయం లో చర్చలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.సాయి పల్లవి కచ్చితంగా హీరో, దర్శకుడు అనే ఎలిమెంట్స్ కాకుండా కథ లో తన పాత్ర మరియు వెయిట్ గురించి ఆలోచిస్తుంది.
అందుకే ఆమె వరుసగా సినిమాలు చేయకుండా మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ ఉన్న విషయం తెల్సిందే.హీరోయిన్ గా సాయి పల్లవి విషయం లో చాలా మంది కి చాలా అంచనాలు ఉన్నాయి.

వాటన్నింటిని అందుకుంటూనే తనకంటూ నిర్ణయించుకున్న లైన్ లో సాయి పల్లవి వెళ్తున్నారు.అందుకే ఆమె సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది.తాజాగా రామ్ చరణ్( Ram Charan ) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా లో సాయి పల్లవి ని హీరోయిన్ గా నటింపజేయాలనే చర్చలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
కానీ అవన్నీ కూడా పుకార్లే అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు.

రామ్ చరణ్ కోసం బాలీవుడ్( Bollywood ) హాట్ బ్యూటీ తో బుచ్చి బాబు చర్చలు జరిపాడు.ఆమె దాదాపుగా ఓకే చెప్పినట్లే అంటూ చాలా మంది నుంచి సమాచారం అందుతోంది.సరే సాయి పల్లవిని సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఎంపిక చేసి ఉంటారేమో అని అనుకుంటూ ఉన్నారు.
అయితే సాయి పల్లవి మాత్రం సెకండ్ హీరోయిన్ కి ఓకే చెప్పడం సాధ్యం కాదు.కనుక బుచ్చి బాబు మరియు సాయి పల్లవి మధ్య చర్చలు కేవలం పుకార్లే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







