సాయిధరమ్ తేజ్ కి రియల్ లైఫ్ లో ఎంత ఆస్థి ఉందో తెలుసా.. ?

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

సాయిధరమ్ తేజ్1986అక్టోబర్ 15న హైదరాబాద్ లో శివ ప్రసాద్, విజయదుర్గలకు జన్మించాడు.ఆయనకు ప్రస్తుతం 35 సంవత్సరాలు ఉన్నాయి.

ఇక ఇతడి తమ్ముడు వైష్ణవ తేజ్ కూడా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు.ఆయన మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు.ఇక ఆయనకు తేజ్, చింటూ అనే ముద్దుపేర్లు న్నాయి.

Advertisement
Sai Dharam Tej Real Life Properties And Details, Sai Dharam Tej, Pilla Nuvvuleni

ఇక సాయి ధరమ్ తేజ్ నెల్లూరు రెయిన్ బో హైస్కూల్ లో 6వ తరగతి వరకూ చదువుకున్నారు.ఆయనను నెల్లూరులో స్కూల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకెళ్లేవాళ్ళారంట.

ఇక తేజ్ ఏదో ఒకటి కొనిస్తే తప్ప స్కూల్ కి వెళ్ళేవాడు కాదంట.ఆ తరువాత హైదరాబాద్ నలంద హైస్కూల్ లో చదువుకున్నారు.

అతను సెయింట్ మేరీస్ కాలేజీలో ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు.అయితే చదువు అయ్యాక జాబ్ చేయడం స్టార్ట్ చేసినట్లు తెలిపారు.

ఇక 2015లో వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో రేయ్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు.అయితే బడ్జెట్ పెరిగిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

దాంతో ఏఎస్ రవికుమార్ డైరెక్షన్ లో పిల్లా నువ్వులేని జీవితం మూవీతో కెరీర్ స్టార్ట్ అయిందని అన్నారు.

Sai Dharam Tej Real Life Properties And Details, Sai Dharam Tej, Pilla Nuvvuleni
Advertisement

ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,సుప్రీం,విన్నర్,చిత్రలహరి,సోలో బ్రతుకే సో బెటర్ మూవీస్ తో సాయిధరమ్ తేజ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాడు.ఇక మొదటి సినిమా పిల్లా నువ్వులేని జీవితం మూవీ కోసం 60లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

ఇక సోలో బ్రతుకే సో బెటర్ మూవీకి 11కోట్లు దాకా అందుకున్నట్లు సమాచారం.అంతేకాదు.నెట్ వర్త్ రూ200కోట్లు ఉంటుందని అంచనా.

ఇక మెగాస్టార్ చిరంజీవి,పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమైన హీరోలు.తేజ్ కి శ్రీదేవి ఇష్టమైన హీరోయిన్.

ఇక క్రికెట్ ఆడడం,ట్రావెలింగ్ అంటే ఇష్టం.పప్పు ఆవకాయ్ అంటే ఇతడికి చాలా ఇష్టమంటా.

తేజ్ కి హైదరాబాద్, ఊటీ అంటే ఇష్టమైన ప్రదేశాలుగా తెలిపారు.అంతేకాదు.

ఇతడికి మూడు విలాసవంతమైన కార్లు,ఒక స్పోర్ట్స్ బైక్ ఉన్నాయని అన్నారు.ఇక జూబ్లీ హిల్స్ ఎంపీ ఎం ఎల్ ఏ క్వార్ట్రర్స్ దగ్గర ఖరీదైన ఇల్లు ఉంది.

తాజా వార్తలు