మా చిన్న మామ బాట లో నేను నడవను...

సినిమా ఇండస్ట్రీ( Film Industry ) లో సినిమాలు చాలా మంది హీరో లు స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ ఉంటారు కానీ కొందరు మాత్రం రీమేక్ సినిమాలు( Movie Remakes ) చేస్తూ ఉంటారు.

అయితే ఆ రీమేక్ సినిమాలు చేసేటప్పుడు వచ్చే సమస్య ఇంకెప్పుడూ రాదు అంటుంటారు.

ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు తీస్తే.అదే తీశారు ఏముంది అంటారు.

పోనీ ఏమైనా మార్పులు చేస్తే మాతృకలో ఉన్న పవర్‌ ఇందులో లేదు అంటుంటారు.అయితే ఇదంతా మేకర్స్‌ సమస్య.

అయితే హీరోలకు కూడా ఈ సమస్య ఉంటుంది.అయితే అది ఇంకో రకం.మాతృకలోని హీరోను కొత్త సినిమాలో హీరోతో పోలుస్తారు.ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే… రీమేక్‌ గురించి ఓ హీరో మాట్లాడారు కాబట్టి.

Advertisement

టాలీవుడ్‌లో రీమేక్‌లు అంటే.ముందుకొచ్చే హీరోల్లో పవన్ కల్యాణ్( Pawan Kalyan ), చిరంజీవి, వెంకటేశ్ ముందుంటారు.వీళ్ళు కెరియర్ లో చాలా వరకు రీమేక్ సినిమాలతోనే మంచి హిట్లు కొట్టారు.

నిజానికి చిరంజీవి కెరియర్ డౌన్ లో ఉన్న ప్రతిసారీ రీమేక్ సినిమాలే ఆయన్ని మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించాయి ఉదాహరణకు హిట్లర్ సినిమా కి ముందు చిరంజీవి కి వరుసగా ప్లాప్ లు వచ్చాయి.ఇక ఆ సినిమా తో మళ్ళీ చిరంజీవి హిట్ ట్రాక్ ఎక్కాడు.

అయితే ఆయన రీ ఎంట్రీ లో కూడా తమిళ్ రీమేక్ సినిమా అయిన కత్తి ని రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు.అలాగే వెంకటేష్ కూడా చాలా సినిమాలు రీమేక్ చేశాడు అందులో సూర్య వంశం,రాజా,మొన్న వచ్చిన దృశ్యం,నా లాంటి రీమేక్ సినిమాలతో హిట్ కొట్టారు.

ఇక పవన్ కళ్యాణ్ అయితే తమ్ముడు,సుస్వాగతం, వకీల్ సాబ్, భిమ్లా నాయక్ లాంటి సినిమాలు రీమేక్ సినిమాలే.ఇక ఇండస్ట్రీ లో ఉన్న మిగిలిన హీరోలు రీమేక్ లా మీద పెద్దగా ఆసక్తి చూపించరు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

ఇప్పుడు ఈ లిస్ట్‌లో సాయి ధరమ్‌ తేజ్‌( Sai Dharam Tej ) కూడా చేరారు.ఎందుకంటే సాయితేజ్ కూడా రీమేక్స్‌కు వ్యతిరేకం అంటున్నాడు.మెగా కాంపౌండ్ హీరోలు వరుసపెట్టి రీమేక్స్ చేస్తుంటే అదే కాంపౌండ్‌కి చెందిన సాయితేజ్ ఇలా స్పందించడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే అని చెప్పాలి.

Advertisement

నేను రీమేక్‌లు చేయను, భవిష్యత్తులో రీమేక్స్ ఆలోచన కూడా చేయను అంటూ సాయి ధరమ్‌ తేజ్‌ క్లారిటీ ఇచ్చేశాడు.ఎందుకు అలా అనుకుంటున్నాడో కూడా చెప్పేశాడు.రీమేక్స్ చేయాలంటే హీరోకు ఓ స్పెషల్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి.

అందుకే రీమేక్‌లు చేయాలని అనుకోవడం లేదు.పవన్ కల్యాణ్ సినిమాలు( Pawan Kalyan Movies ) రీమేక్ చేస్తారా అంటే.

ఆ ఆలోచన అస్సలు లేదు అని చెప్పాడు.పవన్‌ సినిమా రీమేక్ చేసి అంచనాలు అందుకోవడం చాలా కష్టం.

ఓ అభిమానిగా ఆ పని చేయలేను అని క్లారిటీ ఇచ్చేశాడు.అయితే మరీ చేయాలని అనుకుంటే కచ్చితంగా తొలిప్రేమ సినిమాను రీమేక్ చేస్తానని చెప్పాడు సాయితేజ్‌.

మరి ఈ దిశగా ఎవరైనా ఆలోచిస్తారా అనేది చూడాలి.అయితే ఇప్పుడు పాత సినిమాల్ని రీమేక్‌లు చేసే పరిస్థితి మన దగ్గర లేదు.

తాజా వార్తలు