ఐపీఎల్ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్..!

భారత లెజెండరీ క్రికెటర్ సచిన్( Sachin Tendulkar ) తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు.అయితే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులోకి ఎప్పుడో చేరిన.

 Sachin's Son Arjun Tendulkar Entered The Ipl Match Sachin Tendulkar , Arjun Tend-TeluguStop.com

అవకాశం మాత్రం తొలిసారి ఆదివారం (ఏప్రిల్ 16) కోల్ కత్తా తో జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ కు అవకాశం వచ్చింది.

ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ రెండు ఓవర్లకు 17 పరుగులు ఇచ్చాడు.

తొలి మ్యాచ్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు.ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

ఇక బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.అయితే అర్జున్ టెండూల్కర్ చెల్లెలు సారా( Sara Tendulkar ) స్టాండ్స్ లో నుంచి అర్జున్ ను ఎంకరేజ్ చేసింది.

సచిన్ టెండూల్కర్ మాత్రం ముంబై ఇండియన్స్ క్యాంప్ లోనే ఉండి, తనయుడు ఆడిన తొలి మ్యాచ్ చూడలేదు.దానికి అసలు కారణం ఏమిటంటే అర్జున్ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా ఆడాలనే ఉద్దేశంతోనే తాను మ్యాచ్ చూడలేదని తెలిపాడు.

తాను మ్యాచ్ చూస్తే కచ్చితంగా అర్జున్ ఒత్తిడికి లోనవుతాడని, ఇప్పటివరకు తాను అర్జున్ ఆటను చూడలేదని చెప్పాడు.క్రికెట్ లో రాణించాలంటే ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛ ఉండాలని తెలిపాడు.ఇక మ్యాచ్ జరిగినంత సేపు మధ్య మధ్యలో మెగా స్క్రీన్ చూస్తూ ఎంజాయ్ చేశానని తెలిపాడు.

ఐపీఎల్ తొలి సీజన్ 2008లో ముంబై ఇండియన్స్ కు తాను ప్రాతినిథ్యం వహించానని, ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ టెండూల్కర్ ఆడడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ఇది తనకు కొత్త అనుభవం అని సచిన్ చెప్పాడు.మ్యాచ్ అనంతరం తన తొలి మ్యాచ్ గురించి అర్జున్ టెండూల్కర్ స్పందిస్తూ.ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) నుంచి క్యాప్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తన అనుభవాన్ని పంచుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube