భారత జట్టు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) ఇటీవలే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.తన పేరును తన అనుమతి లేకుండా ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్న ఓ మెడికల్ కంపెనీపై ఫిర్యాదు చేశాడు.
తన అనుమతి లేకుండా తన ఫోటోలతో పాటు వాయిస్ ను కూడా ప్రమోషన్స్ కోసం ఈ మెడికల్ కంపెనీ వాడుకుంటుందని తెలిపాడు.ఈ మెడికల్ కంపెనీ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
సచిన్ హెల్త్.ఇన్ అనే పేరుతో డ్రగ్ కంపెనీ ఓ వెబ్సైట్ ఏర్పాటు చేసి అందులో సచిన్ ఫోటోలను పొందుపరిచింది.
అంతేకాకుండా ప్రమోషన్ కోసం సచిన్ వాయిస్ ను కూడా డబ్బింగ్ ద్వారా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.

సచిన్ తన పేరును, ఫోటోలను, వాయిస్ ను ఉపయోగించుకునేందుకు ఆ డ్రగ్ కంపెనీకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపాడు.తన అనుమతి లేకుండా తన ఫోటోగ్రాఫ్స్, వాయిస్ వాడుకుంటున్న మెడికల్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెస్ట్ రీజియన్ క్రైమ్ పోలీసులకు సచిన్ టెండూల్కర్ ఫిర్యాదు చేశాడు.

ఇక పోతే సచిన్ టెండూల్కర్ 2012లో వన్డే లకు, 2013 లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.రిటైర్మెంట్ ప్రకటించి దశాబ్ధ కాలం దాటిన సచిన్ టెండుల్కర్ కు ఉండే క్రేజ్ మాత్రం ఒక్క ఇంచు కూడా తగ్గలేదు.సచిన్ టెండుల్కర్ ఒక్క బ్రాండ్ ప్రమోషన్ కోసం 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
భారత క్రికెటర్లలో మహేంద్రసింగ్ ధోని( MS Dhoni ), విరాట్ కోహ్లీ తర్వాత బ్రాండ్ ప్రమోషన్స్ కు అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న క్రికెటర్ గా సచిన్ టెండుల్కర్ నిలిచాడు.తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ( Cyber crime police )సచిన్ టెండుల్కర్ ఆశ్రయించడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.