రాజస్థాన్ రాజకీయాల్లో కీలక మలుపు, మళ్లీ సొంతగూటికి పరుగులు తీస్తున్న పైలట్

రాజస్థాన్ రాజకీయాల్లో టర్న్ అండ్ ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా కాంగ్రెస్ రెబల్ నేత,రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

సచిన్ తాజాగా పార్టీ పెద్దలను కలవడం తో ఈ అంశం కీలక మలుపులు తిరిగింది.రాహుల్ నివాసంలో రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ తో భేటీ అయిన ఆయన రాజీకొచ్చినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే సచిన్ రాజీపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్,ప్రియాంక గాంధీ లతో భేటీ ఘటన మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.త్వరలో రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న ఈ సమయంలో సచిన్ పైలట్ పార్టీ పెద్దలతో భేటీ అవ్వడం తో అయన రాజీకొచ్చారు అన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

త్వరలోనే దీనిపై సానుకూల స్పందన వస్తుంది అంటూ కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం మరింత బలపడుతుంది.ఇటీవల రాజస్థాన్ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Advertisement

సొంత పార్టీ పైనే వ్యతిరేకత వ్యక్తం చేసిన సచిన్ 19 మంది ఎమ్మెల్యేల తో పాటు పార్టీ సమావేశాలకు కూడా హాజరుకాకుండా మొండికేశారు.అయితే ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అని బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.

అయితే వాటన్నిటిని కొట్టేసిన సచిన్ సొంత పార్టీలోనే రెబల్ నేతగా నిలిచారు.సచిన్ పైలట్‌కు చెందిన వర్గం సీఎం అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది.

ఆయన వైపు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.తనకు సీఎం పదవి ఇవ్వాలని సచినల్ పైలట్ పట్టుబట్టారు.

ఆ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సచిన్ పైలట్‌ను పీసీసీ చీఫ్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించారు.ఆ తర్వాత అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నోటీసులు కూడా ఇవ్వడంతో ఈ వ్యవహారం పై పైలట్ వర్గం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు

రెండు న్యాయస్థానాలు కూడా పైలట్ వర్గానికి మద్దతు తెలపడం తో ఈ వ్యవహారం సద్దుమణిగింది.అయితే ఇప్పుడు తాజాగా పార్టీ పెద్దలతో భేటీ అవ్వడం తో పైలట్ రాజీకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement

మరి దీనిపై క్లారిటీ తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

తాజా వార్తలు