కన్నీళ్లు పెట్టించే కథ : కూతురి కోసం ఐఫోన్ సమాధి కట్టించాడు ..అసలు విషయం తెలిస్తే ఆ తండ్రి ప్రేమకు ఫిదా అవుతారు..

అదేంటో కొడుకు కన్నా ఎక్కువ కూతురంటేనే నాన్నలకు ఇష్టం.అలాగే అమ్మకంటే నాన్నంటేనే కూతుర్లకు ప్రేమెక్కువా.

 Russian Woman Gets Iphone Shaped Tombstone Thanks To Her Father-TeluguStop.com

తండ్రీ కూతుర్ల మధ్య బంధం వర్ణించడం కష్టం.కూతురి సంతోషం కోసం తల తాకట్టు పెట్టడానికైనా సిద్దపడ్తారు నాన్నలు.

అలా ఒక తండ్రి తన కూతురుకోసం ఐఫోన్ ని సమాధిగా మార్చాడు.ఐఫోన్ ని సమాధిగా మారిపోవడమేంటి అనుకుంటున్నారా.

అసలు విషయం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు.ఆ తండ్రి ప్రేమకు ఫిదా అవుతారు… వివరాల్లోకి వెళితే.

రష్యాలో ఆయిల్ సిటీగా పేరుగాంచిన ఉఫాకి చెందిన రైస్ షమీవ్ అనే వ్యక్తి తన కూతురు రీటాకోసం ఈ సమాధిని కట్టించారు.తన కూతురు రీటా అంతుతెలియని జబ్బుతో చనిపోయింది.ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఎంతో చలాకీగా ఉండే రీటా.25 సంవత్సరాల వయసులో కన్నుమూసింది.కూతురు మరణంతో ఆ తండ్రి రైస్ షమీవ్ కన్నీరుమున్నీరయ్యాడు.కూతురు కోసం ఏమైనా చేయాలనుకున్నాడు.తనకి ఐఫోన్ కొనిచ్చిన రోజు చాలా సంతోషంగా ఉందనే విషయం గుర్తొచ్చింది….తను ఐఫోన్‌ను అమితంగా ఇష్టపడేదని, కాబట్టే తన జ్ఞాపకార్ధం తన సమాధిని ఐ ఫోన్ రూపంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు.

దాదాపు 5 అడుగుల ఎత్తు ఉండే ఈ సమాధిలో, ఐఫోన్ డిస్ ప్లే లో తన కూతురు ఫోటోని ఉంచేలా తయారు చేయించాడు.

ఈ ఐదడుగుల ఐఫోన్ సమాధి నిర్మాణం చేయడానికి ఉక్రెయిన్ నుండి తీసుకొచ్చిన ఖరీదైన సున్నపరాయిని వాడారు.ఈ ఐఫోన్ సమాధి ఎన్ని వేల సంవత్సరాలు అయినా చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మించారు.ఇటీవలే యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ ఎక్స్ఎస్ మాదిరిగా దీన్ని రూపొందించారు.

ప్రస్తుతం ఐఫోన్ ఎక్స్ఎస్ ఖరీదు 72,400 రూపాయలు ఉండగా.ఈ సమాధి కట్టించడానికి కూడా దాదాపుగా 71,490 రూపాయలు ఖర్చయిందట.

దీనిని నల్ల రంగు ఐఫోన్ ఆకారంలో నిర్మించారు.క్యూఆర్ కోడ్ తో సహా ఈ సమాధిని నిర్మించడం విశేషం.

ఈ సమాధి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మీరూ చూడండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube