పైలట్స్( Pilots ) చిన్న పొరపాటు చేసినా అది పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది.అలాంటిది రష్యాలో( Russia ) ఒక పైలట్ విమానాన్ని రన్‌వేపై ల్యాండ్ చేయాల్సింది పోయి నదిపై ల్యాండ్ చేశాడు.
అదృష్టవశాత్తు అప్పుడు నది గడ్డకట్టి ఉంది.లేదంటే విమానం నీటిలో మునిగిపోయి అందులో ప్రయాణిస్తున్న వారందరూ చాలా సమాధి అయి ఉండేవారు.30 మందితో ప్రయాణిస్తున్న ఈ రష్యా విమానం పొరపాటున గడ్డకట్టిన కోలిమా నదిపై( Kolyma River ) ల్యాండ్ అయింది.పైలట్ పొరపాటు చేయడంతో విమానాశ్రయంలో రన్‌వే మిస్ అయింది.
విమానం( Flight ) ఇసుక ఒడ్డుపై ఆగే వరకు మంచు మీద జారిపోయింది.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ, ప్రయాణికులు మాత్రం విమానం నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఈ విమానం యాకుట్స్క్ నుంచి జిర్యాంకాకు వెళుతోంది.ఈ ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది.విమానం జిర్యాంకా( Zyryanka ) వద్ద ఆగి, యాకుట్స్క్‌కు( Yakutsk ) తిరిగి రావడానికి ముందు మరొక పట్టణమైన స్రెడ్‌నెకోలిమ్స్‌క్‌కు వెళ్లాల్సి ఉంది.
ఈ సంఘటన డిసెంబర్ 28న జరిగింది.పైలట్ తప్పు వల్లే ఇది జరిగిందని అధికారులు నిర్ధారణకి వచ్చారు.అధికారులు ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో విమానానికి సంబంధించిన వీడియో, కొన్ని ఫొటోలు పోస్ట్ చేసారు.
ఫొటోలలో నదిపై విమానం, ప్రయాణికులు మంచు మీద నడుస్తున్నట్లు కనిపించింది.వీడియోలో విమానం గడ్డకట్టిన నదిపై కింద పడిపోకుండా ఉండటం గమనించవచ్చు.
ఈ ఘటనకు పైలట్ తప్పిదమే కారణమని అధికారులు తెలిపారు.అతను సరిగ్గా విమానం నడపలేదని, రన్‌వే మిస్ అయిందని వారు చెప్పారు.
ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.