గ్రామీణ ప్రాంత కులవృత్తులను కాపాడాలి:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదాద్రి భువనగిరి జిల్లా:చేనేత కళ ఒకరి నుండి మరొకరికి వారసత్వంగా కొనసాగడం,గురు శిష్య బంధాన్ని ఏర్పరచడం అభినందనీయమని,చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం,అధికారులు మరింత చొరవచూపాలని, చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( Droupadi Murmu )అన్నారు.బుధవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) పోచంపల్లి మండలంలో పర్యటించారు.

 Rural Castes Should Be Protected: Droupadi Murmu Yadadri Bhuvanagiri , Pochampa-TeluguStop.com

ఈ సందర్భంగా రాష్ట్రపతికి మంత్రి సీతక్క,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,కేంద్ర మంత్రి త్వశాఖ సెక్రటరీ రచన సాహు, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు.అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందన్నారు.

పోచంపల్లి,వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు ట్యాగ్ రావడం అభినందనీయమని, పోచంపల్లి చేనేత వస్త్రాలను( Pochampally sari ) చూస్తే సంతోషం కలిగిందన్నారు.భారత సంస్కృతి, సంప్రదాయాల్లో చేనేత ఒకటన్నారు.

యూఎన్ఏ భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమన్నారు.ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతుదొరుకుతుందన్నారు.

చేనేత వస్త్రాల కృషి గొప్పదన్నారు.కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్ప విషయమన్నారు.

ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందించడం గొప్ప కళాకారుల లక్ష్యమని,చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న అవార్డు గ్రహీతలందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలన్నారు.చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని,గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలన్నారు.

తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube