విడాకులు తీసుకోనున్న బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ.. అదే కారణమంటూ?

ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.ధనుష్ ఐశ్వర్య, నాగచైతన్య సమంతల విడాకుల గురించి ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండగా విజయ్ ఆంటోనీ కూడా విడాకులు తీసుకోనున్నారని తెలుస్తోంది.

 Rumours Goes Viral About Vijay Antony Divorce Details, Vijay Anthony, Vijay Anth-TeluguStop.com

విజయ్ ఆంటోని డైరెక్ట్ గా ఈ విషయాన్ని వెల్లడించకపోయినా తన పోస్ట్ ద్వారా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చింది.

తన ట్విట్టర్ అకౌంట్ లో మీ ఫ్యామిలీలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను మీలో మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని విజయ్ ఆంటోని అన్నారు.

అది వీలు కాని పక్షంలో ఎవరి దారి వారు చూసుకోవాలని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు.అవసరం అనుకుంటే మరొకరి కాళ్లు మొక్కి రాజీకి రావాలని విజయ్ ఆంటోని సూచనలు చేశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తిని మాత్రం మీ జీవితాల్లోకి రానీయొద్దని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు.

ఎందుకంటే మూడో వ్యక్తి జీవితంలోకి వస్తే వాళ్లు మిమ్మల్ని నాశనం చేసి సంతోషిస్తారు అని విజయ్ ఆంటోని కామెంట్లు చేశారు.

Telugu Bichhagadu, Fathimavijay, Vijay Anthony, Rumours, Vijayanthony, Vijay Ant

విజయ్ తన భార్యతో విడాకులు తీసుకోనున్నారని అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రస్తుతం విజయ్ ఆంటోని అగ్ని సిరగుగల్ అనే సినిమాలో నటిస్తున్నారు.నవీన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Telugu Bichhagadu, Fathimavijay, Vijay Anthony, Rumours, Vijayanthony, Vijay Ant

రథం, కొలై మరికొన్ని ప్రాజెక్ట్ లు సైతం విజయ్ ఆంటోని చేతిలో ఉన్నాయి.విజయ్ ఆంటోని వ్యక్తిగత జీవితం వివాదాల్లో చిక్కుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.మరోవైపు ఈ మధ్య కాలంలో విజయ్ ఆంటోని నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు.

విజయ్ ఆంటోని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube