సీనియర్ నరేశ్ పవిత్ర లోకేశ్ కలిసి కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.కొన్నినెలల క్రితం సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.
నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు కావడంతో పవిత్ర లోకేశ్ కు నటిగా మంచి గుర్తింపు ఉండటంతో ఈ వార్త అప్పట్లో సంచలనం అయింది.అయితే నరేష్ పవిత్ర లోకేశ్ విడిపోయారంటూ ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్ మీడియాలో వినిపిస్తోంది.
ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వల్లే వీళ్లిద్దరూ విడిపోయారని సమాచారం అందుతోంది.అయితే నరేష్ లేదా పవిత్ర లోకేశ్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
సీనియర్ నరేష్ ఈ వార్తల గురించి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
వైరల్ అయిన వార్తల వల్ల పవిత్ర లోకేశ్ కు గతంతో పోల్చి చూస్తే సినిమా ఆఫర్లు అయితే తగ్గాయని ప్రచారం జరగడం గమనార్హం.
కొన్ని సినిమాలలో పవిత్ర లోకేశ్ ఎంపికైన తర్వాత ఆమెను తొలగించారని తెలుస్తోంది.మరోవైపు పవిత్ర లోకేశ్ భర్త చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ కాగా నరేష్ తో సన్నిహితంగా ఉన్న సమయంలో ఎక్కువమంది పవిత్ర లోకేశ్ ను తప్పుబట్టారు.
మరోవైపు నరేష్ కు మూడో భార్య రమ్య రఘుపతి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ప్రస్తుతం నరేష్ వయస్సు 62 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.సీనియర్ నరేష్ గురించి వైరల్ అవుతున్న వార్తలు కొంతమంది ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి.నరేష్ పవిత్ర లోకేశ్ జోడీకి స్క్రీన్ పై కనిపిస్తే నెగిటివ్ కామెంట్లు వస్తున్న నేపథ్యంలో డైరెక్టర్లు ఈ జోడీపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.