ఈతరం ప్రేక్షకులకు దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యూట్యూబ్ లో హారిక యూట్యూబ్ ఛానల్ కు దాదాపుగా 2 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నారంటే ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందనే విషయం సులువుగానే అర్థమవుతుంది.
అయితే కొన్ని నెలల క్రితం వరకు వరుసగా వీడియోలు చేసి ప్రేక్షకులకు వినోదం అందించిన దేత్తడి హారిక ప్రస్తుతం పరిమితంగా వీడియోలు చేస్తున్నారు.
అయితే దేత్తడి హారిక అతి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని తక్కువ సంఖ్యలో ఈమె వీడియోలు చేయడం వెనుక అసలు కారణం ఇదేనని బోగట్టా.
తోటి యూట్యూబర్ ను దేత్తడి హారిక పెళ్లి చేసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.తనతో పాటు యాక్ట్ చేసిన వ్యక్తినే దేత్తడి హారిక పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.
అతి త్వరలో హారిక ఆ వ్యక్తి పేరును రివీల్ చేయనున్నారు.
బిగ్ బాస్ షో సీజన్4 కంటెస్టెంట్లలో ఒకరైన హారిక ఆ షో టాప్5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు.
హారిక స్పందిస్తే వైరల్ అవుతున్న వార్తలకు స్పందించి మరింత స్పష్టత వస్తుందని చెప్పవచ్చు.అమెజాన్ లో ఉద్యోగాన్ని వదులుకుని యూట్యూబ్ నే కెరీర్ గా మలచుకున్న హారిక అనుకున్న స్థాయి కంటే సక్సెస్ సాధించారనే చెప్పాలి.
హారిక పలు సినిమాలలో నటించడంతో పాటు బుల్లితెర షోలలో కూడా పాల్గొని సందడి చేశారు.
కెరీర్ విషయంలో హారిక ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.హారిక తెలంగాణ యాసకు చాలామంది అభిమానులు ఉన్నారు.తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడే హారిక తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా హారికకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.