జక్కన్న గురించి మళ్లీ పుకార్లు మొదలు.. ఈసారి ఏమని సమాధానం ఇస్తాడో

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళికి ఉన్న క్రేజ్‌ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం నటించాలని, సినిమాలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు.

 Rumours About Rajamouli Vikramarkudu Movie Sequel-TeluguStop.com

అలాంటి రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ అయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ లతో భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేసేందుకు జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడు.

రాజమౌళి ఒక వైపు మల్టీస్టారర్‌ చిత్రంతో బిజీగా ఉండగానే ఆయన తర్వాత సినిమా గురించి ప్రచారం మొదలైంది.బాహుబలి సినిమా సమయంలో కూడా రాజమౌళి తదుపరి చిత్రం విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

మహేష్‌ హీరోగా అని, బాలీవుడ్‌ లో రాజమౌళి సినిమా అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది.

ఇప్పుడు మల్టీస్టారర్‌ చిత్రం తర్వాత విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్‌ చేయాలని నిర్ణయించుకున్నాడట.

సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రాజమౌళి దర్శకత్వంలో గతంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్‌ కోసం కొన్ని రోజుల క్రితం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఒక మంచి స్టోరీ లైన్‌ను సిద్దం చేశాడని, ఆ స్టోరీ లైన్‌ కూడా జక్కన్నకు నచ్చిందని, వచ్చే ఏడాదిలో ఆ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే విక్రమార్కుడు సీక్వెల్‌ను ఎవరితో చేస్తాడో అనేది చూడాలి.గతంలో రాజమౌళితో విక్రమార్కుడు సినిమాను జక్కన్న తెరకెక్కించిన విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube