రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ అరాచక,ఆటవిక,విధ్వంస పాలన సాగిస్తున్నఅధికారపార్టీ నాయకులకు పోలీసులు అండగా నిలుస్తున్నారు.పోలీసులు, అధికారులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సహజమే.
కానీ నేడు ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో కొందరు ఐపీఎస్ లు జగన్ ప్రభుత్వానికి వీరవిధేయత చూపించి వీరగంధాలు పూస్తున్నారు.శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అరాచకం, విధ్వంసం, దాడులు వదిలేసి అధికారపార్టీ నాయకుల రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మద్దతు ఇస్తున్నారు పోలీసులు .ఒకరాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ద్వంసం చేసినా ఎవ్వరిపైనా చర్యలులేవు.అట్లాగే వారిహక్కులు కోసం పోరాడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలపై విచక్షణారహితంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ప్రజలుప్రతిపక్షాలు వైకాపా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆదారపడి జీవించాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు.మాకుఎదురు రావడమే మహానేరం అన్న విధంగా పరిపాలన సాగిస్తున్నారు.భావప్రకటనా స్వేచ్చకు ఇనుపసంకెళ్లు వేసేఖాకీల క్రౌర్యం రాజ్యమేలుతుంది.ఎవరు నోరుతెరిచినా వారికిమూడినట్లే అన్న విధంగా ఫాసిస్టుపాలన సాగిస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వపెద్దల ఆదేశాలతో పోలీసులుచట్టాన్ని తమచేతుల్లోకి తీసుకొని ప్రతిపక్షనాయకులను, కార్యకర్తలను అరెస్టులుచేసి హింసిస్తున్నారు.గతంలో ఏప్రభుత్వం ఈవిధమైన వికృతరూపాన్ని ప్రదర్శించలేదు.
ప్రజాస్వామ్యంలోప్రభుత్వాలను ప్రతిపక్షాలు ప్రశ్నించడం, విమర్శించడం సహజం.

సోషల్ మీడియా పోస్టింగులపై వైకాపానాయకులు ఫిర్యాదుచెయ్యడం ఆలస్యం పోలీసులుకూడా మెరుపువేగంతో స్పందిస్తూ ఐపీసీలోని 500 సెక్షన్లలో ఏదోఒక దానిని చేత పట్టుకొని పరుగెత్తుకొచ్చి కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.సోషల్ మీడియా పోస్టుల కేసుల విషయంలో చట్టం అధికారంలో వున్నవారివైపే పనిచేస్తుంది.అధికారపార్టీ పిర్యాదులపైనే పోలీసులు స్పందిస్తున్నారు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టే శాంతియుత నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకుండా వాటిలో పాల్గొనకుండా నోటీసులుఇస్తూ, గృహ నిర్భాందాలు చేస్తున్నారు.
గతంలో ఎన్నడన్నా పోలీసులు ఈ విధంగా వ్యవహరించారా? రాష్ట్రంలో పోలీసింగ్ పై ఆరోపణలు, పనితీరులో పక్షపాతం చూపిస్తూ, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.రాష్ట్రంలో రాజద్రోహం కేసులు పెరిగాయి.
జగన్ పాలనలో ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా దేశద్రోహం కేసుపెట్టడం పోలీసులకు ఆనవాయితీగా మారింది.సుప్రీంకోర్టు కూడా తప్పు బట్టిన సెక్షన్ 124 కేసులు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో నమోదుకావడం జగన్ అరాచరిక పాలనకు అద్దం పడుతుంది.
.






