భారి తారాగణం, భారి బడ్జెట్, గుణశేఖర్ కెరీర్లోనే ప్రతిష్టత్క్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “రుద్రమదేవి” … గుణశేఖర్ ఏళ్ల కల ఈ చిత్రం.ఉన్నదంతా సరిపోదని, అప్పులు చేసి మరి సినిమా పూర్తి చేస్తున్నాడు గుణశేఖర్.
నిజానికి ఎప్పుడో విడుదల అవాల్సిన సినిమా రుద్రమదేవి.కాని విడుదల చేసిన ట్రైలర్ కి నెగెటివ్ రెస్పాన్స్ రావడం, గ్రాఫిక్స్ ని అంతా బాహుబలి తో పోల్చి పరువు తీయడంతో .మళ్ళి గ్రాఫిక్స్ వర్క్ మొదలుపెట్టారని .అందుకే ఇంత ఆలస్యం జరిగిందని టాక్.
ఇక ఇవన్ని పక్కన పెడితే ఈ చిత్రం యొక్క హింది హక్కులు అభిషేక్ పిక్చర్స్ , రిలయెన్స్ సంస్థలు సంయుక్తంగా 22 కోట్లకు కొనుక్కున్నారు.హవ్వా అనిపించే అమౌంట్ మరి ఇది.దీనికి బాహుబలి.కేవలం 10 కోట్లకు అమ్ముడుపోయిన బాహుబలి హింది వెర్షన్ ఏకంగా 120 కోట్ల దాకా నెట్ వసూలు చేసింది .ఈ లెక్కన షేర్ ఎంత లేదన్న 50 కోట్లకు పై మాటే .అంటే కనీసం 40 కోట్ల లాభం.
ఇది చూసే కావచ్చు రుద్రమదేవికి బాహుబలి కన్నా 12 కోట్లు ఎక్కువ పెట్టారు .అయితే ప్రతి చిత్రం బాహుబలి కాదు కదా … మరీ ఎక్కువ పెట్టేసారు ఏమో !
.






