డిసెంబర్ 9వ తారీకు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం( Congress ) కల్పించడం జరిగింది.సోనియా గాంధీ పుట్టిన రోజు నేపథ్యంలో ఆరు గ్యారెంటీల హామీలలో ముందుగా రెండు అమలు చేయబోతున్నారు.
ఆరోజు ఉచిత మహిళల బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ( Arogyashri ) కింద పది లక్షల రూపాయల పెంపు.పెంచే నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది.
ఇదిలా ఉంటే మహిళల ఉచిత బస్సు నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలు పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలో జరుగుతున్న ప్రచారంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టత ఇవ్వడం జరిగింది.
బస్సు టికెట్ చార్జీలు పెంచే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి రెగ్యులర్ గా బడ్జెట్ అందుతుందని.కొన్ని బకాయిలు ఇంకా రావాల్సి ఉందని స్పష్టత ఇచ్చారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో.
మహిళలతో బస్సులు నిండిపోతే పురుషులకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ( Mahalakshmi Scheme )కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఈ ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు.
శనివారం అసెంబ్లీలో మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం రేవంత్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ శనివారం మధ్యాహ్నం ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు పేర్కొన్నారు.