ఆర్‌ఆర్ఆర్ టీం ఆస్కార్‌ ప్రయాణ ఖర్చులను భరించింది ఎవరో తెలుసా!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా లోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావాలని పట్టుదలతో చేసిన ప్రయత్నం సఫలం అయింది.నాటు నాటు పాట అద్భుతమైన సక్సెస్ సొంతం చేసుకుని భారీగా స్పందన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 Rrr Movie Team Spent Big Money For Oscar Award , Rrr Movie,rrr Movie Team, Oscar-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు పాట గురించి ప్రచారం జరిగేలా భారీ ఎత్తున ఖర్చు చేయడం జరిగింది.పలు అంతర్జాతీయ వేదికలపై నాటు నాటు పాట ప్రసారమయ్యేలా రాజమౌళి(Rajamouli) తీవ్రంగా ప్రయత్నించారు.

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలతో ఒప్పందాలకు కుదుర్చుకుని మరీ సినిమా కు పబ్లిసిటీ చేయడం జరిగింది.విదేశాలకు వెళ్లేందుకు కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు.

మొత్తంగా తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) అన్నట్లు ఈ సినిమా పబ్లిసిటీ కోసమే దాదాపుగా 80 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట.

ఆస్కార్ అవార్డు రావడం తో ఆ 80 కోట్ల రూపాయల ఖర్చు గురించి ఏ ఒక్కరు మాట్లాడటం లేదు.మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు.ఎందుకంటే 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్కార్ అవార్డు సొంతమైంది.

అయితే ఆ 80 కోట్ల రూపాయలను ఎవరు ఖర్చు చేశారు అనేది కొద్ది మంది అనుమానం.ఈ సినిమా ను దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే.ఆయన ఈ మధ్య కాలం లో కనిపించడం లేదు.ప్రతి వేదిక పై కూడా రాజమౌళి కీరవాణి(Keeravani) హీరోలు ఇద్దరు హీరోలు మరియు రాజమౌళి తనయుడు కార్తికేయ(Karthikeya) కనిపిస్తున్నారు.

దానయ్య మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

దాంతో ఖర్చు మొత్తం కూడా రాజమౌళి కుటుంబ సభ్యులు భరించినట్లుగా తెలుస్తోంది.కేవలం ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవాలని పట్టుదలతో రాజమౌళి టీం భారీ ఎత్తున ఖర్చు చేయడం జరిగింది.ఆస్కార్ దక్కితే ఆ పెట్టిన పెట్టుబడికి 10 రెట్ల అదనపు లాభం రాజమౌళికి దక్కే అవకాశం ఉంటుంది.

కనుక నిర్మాత దానయ్య కాకుండా రాజమౌళి భారీ ఎత్తున ఖర్చు చేశారని సమాచారం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube