ఆర్ఆర్‌ఆర్‌... స్టార్‌ మా కూడా డేట్ ఫిక్స్‌ చేసింది

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన మార్చి లో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దేశ వ్యాప్తంగా భారీ వసూళ్ల ను సాధించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి లో కూడా ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది.

 Rrr Movie Star Maa Tv Telecast Update ,  Film News,ntr,rajamouli, Ram Charan, Rr-TeluguStop.com

వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా స్టార్ మా అతి త్వరలోనే టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.తాజాగా త్వరలో అంటూ స్టార్‌ మా ఒక ప్రకటన చేసింది.

స్టార్ మా తేదీని కూడా ప్రకటించింది.ఆగస్టు 14వ తారీకున ఈ సినిమా ను టెలికాస్ట్ చేయబోతున్నట్లుగా ఇటీవల జీ సినిమాస్ వారు ప్రకటించారు.

హిందీలో జీ సినిమాస్ వారు ఈ సినిమా ను టెలికాస్ట్ చేయబోతున్న నేపథ్యం లో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు.ఎట్టకేలకు స్టార్ మా వారు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.

స్టార్ మా ఈ సినిమా ని ఆగస్టు 14వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది.ఈ సినిమా ను పెద్ద ఎత్తున టెలికాస్ట్‌ చేసేందుకు గాను స్టార్ మా ఏర్పాట్లలో బిజీగా ఉంది.

మరో వైపు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ను టెలికాస్ట్ చేసేందుకు గాను ఆయన ఛానల్స్ రెడీ అవుతున్నాయి.దేశవ్యాప్తంగా ఒకేసారి ఈ సినిమా ను టెలికాస్ట్‌ చేయడం ద్వారా అత్యధిక రేటింగ్ సాధించాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.

జక్కన్న దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో చరణ్ అల్లూరి గా కనిపించగా ఎన్టీఆర్ కొమురం భీమ్ గా కనిపించారు.ఇప్పటికే చాలా మంది చూశారు.

ఇప్పుడు టీవీ లో చూడబోతున్న వారు అంతా కూడా ఇంతకు ముందు చూసిన వారే అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube