'ఆర్ఆర్ఆర్'తో ఈ స్టార్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అవుతారా ?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్  కోసం సినీ ప్రేక్షకులంతా గత కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.కానీ ఇప్పటి వరకు కరోనా అడ్డంకిగా మారడంతో ఈ సినిమా రోజురోజుకూ వాయిదా పడుతూనే వస్తుంది.

 Rrr Movie Latest News, Rrr, Ntr, Ram Charan, Rajamouli, Alia Bhatt, Pan India Mo-TeluguStop.com

కానీ ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అత్యంత భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది ఆర్ ఆర్ ఆర్ సినిమా.

ఇక ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియా అంతటా సందడి నెలకొంది.

సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ మ్యానియా చూస్తుంటే జక్కన్న టీమ్ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నట్టే కనిపిస్తుంది.ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు, ఇక్కడ బెనిఫిట్ షోలు వీక్షించిన వారు ఈ సినిమాపై పొగడ్తలు కురిపిస్తున్నారు.

Telugu Alia Bhatt, Rajamouli, Ram Charan, Rrr Latest-Movie

అయితే ఇప్పుడు అందరి ద్రుష్టి ఎన్టీఆర్, రామ్ చరణ్ మీద పడింది.ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్  నటించిన విషయం తెలిసిందే.ఇంతకు ముందు రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ స్టార్ హీరోలను కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారుస్తారా అనే చర్చ ఫస్ట్ నుండి జరుగుతుంది.

Telugu Alia Bhatt, Rajamouli, Ram Charan, Rrr Latest-Movie

చరణ్ ఇంతకు ముందు జంజీర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్ లో కొత్తగా పరిచయం అవుతున్నాడు.బాహుబలి కథాంశం కొత్తగా ఉండడంతో అయితే నార్త్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే ఇది బాలీవుడ్ జనాలు ఎప్పటి నుండో చూస్తున్న బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో సినిమాలు చూస్తున్నారు.

దీంతో ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను ఆకర్షిస్తుందా లేదా అనేది అందరి ప్రశ్న .బాలీవుడ్ లో సత్తా చాటితేనే ఏ హీరో అయినా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందుతాడు.ఆర్ ఆర్ ఆర్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమా అక్కడ ప్రజలను ఆకర్షించక పోతే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ఇప్పటికే మేకర్స్ దేశ వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసిన కూడా ఆశించిన స్థాయిలో బుక్కింగ్స్ జరగలేదు.మరి సినిమా టాక్ ను బట్టి బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది.

చూడాలి మరి ప్రభాస్ మాదిరిగా రాజమౌళి ఈ ఇద్దరు స్టార్ హీరోలకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఇస్తాడో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube