ఖరీదైన లగ్జరీ కారు కొన్న దర్శకుడు రాజమౌళి.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన దర్శకుడు రాజమౌళి.

అంతేకాకుండా బాహుబలి సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి తెలుగులో పాన్ ఇండియా సినిమాలు కు పునాది వేశాడు.బాహుబలి సినిమా తో భారీ విజయం అందుకున్న రాజమౌళి ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో మరొక హిట్ టాక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు రాజమౌళి.ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేసాడు.

జక్కన్న ఖరీదైన వోల్వో ఎక్స్‌సి40 కారు కొన్నారు.ఈ సందర్భంగా వోల్వో కార్స్‌ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు.

Advertisement

ఇందుకు సంబంధించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్‌ చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.కాగా రాజమౌళి కొనుగోలు చేసిన ఫ్యూజన్ రెడ్ కలర్‌లో ఉన్న ఈ కారు ధర దాదాపుగా 44.50 లక్షలు అని తెలుస్తోంది.పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇకపోతే రాజమౌళి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న రాజమౌళి ఇక త్వరలోనే మహేశ్‌ బాబుతో కలిసి సినిమా చేయనున్నారు.ఆర్ఆర్ఆర్ ను రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించనివిధంగా కలెక్షన్స్ రాబట్టింది.

ఈ సినిమా విడుదల అయ్యి దర్శకుడు రాజమౌళికి, అలాగే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు