రాజమౌళి ఆ విషయంలో ఎంతో మందికి మార్గదర్శకంగా నిలవబోతున్నాడు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అనుకున్నది సాధించాడు.తన ఆర్ఆర్ఆర్‌ సినిమా ను ఆస్కార్ బరిలో నిలపాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు.

ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ అధికారికంగా ఆర్ఆర్ఆర్‌ సినిమా ను ఆస్కార్ కి నామినేట్ చేయక పోవడం తో రాజమౌళి ఓపెన్ క్యాటగిరి లో సొంతంగా ఆస్కార్ ప్రయత్నం మొదలు పెట్టాడు.రాజమౌళి ఆ ప్రయత్నం చేసిన సమయం లో చాలా మంది ఎగతాళి చేశారు.

ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కి వ్యతిరేకంగా వెళ్తున్నాడు అంటూ కొందరు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు.కానీ తన సినిమా పై నమ్మకం ఉండి తన సినిమాలోని కంటెంట్ పై నమ్మకం ఉన్న రాజమౌళి ఆస్కార్ బరి లో సొంతంగా నిలిచేందుకు ప్రయత్నం చేశాడు.

కాస్త ఖర్చు పెట్టి సినిమా ను పెద్ద ఎత్తున అంతర్జాతీయ సమాజం లో ప్రచారం చేయడం జరిగింది.

Advertisement

ప్రచారానికి తోడు సినిమా లో కంటెంట్ ఉండడం తో గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం అవడం తో పాటు ఏకంగా ఆస్కార్ కి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెలిసిందే.రాజమౌళి చేసిన ఈ పని భవిష్యత్తు తరాల ఫిలిం మేకర్స్ కి ఆదర్శం అనడం లో సందేహం లేదు.ఇక నుండి తమ సినిమాలను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు ఆస్కార్ కి అధికారికంగా పంపించకుంటే తామే స్వయంగా ఆస్కార్‌ బరిలో నిలపాలని ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా కంటెంట్ ఉంటే ఫలితం దక్కుతుంది అని రాజమౌళి నిరూపించారు.

అందుకే ఇక నుండి చాలా మంది ఇండియన్ ఫిలిం మేకర్స్ తమ కంటెంట్ పై నమ్మకం తో ఆస్కార్‌ బరిలో నేరుగా నిలిచేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆస్కార్ అవార్డు దక్కినా దక్కకున్నా నామినేషన్స్ లో చోటు సొంతం అయినా కూడా చాలా గొప్ప విషయం.కనుక నామినేషన్స్ కోసం ప్రయత్నించినా కూడా తప్పేం లేదు.

Advertisement

తాజా వార్తలు