విదేశాలలో ఆర్ఆర్ఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా... కార్లతో అభిమానాన్ని చాటుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్ .ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, శ్రీయ, అజయ్ దేవగన్ లాంటి ప్రముఖులు నటించారు.

 Rrr Craze Is Next Level In Abroad Ntr Fans Promotes Rrr Movie Different Way, Rrr-TeluguStop.com

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా వేయవలసి వచ్చింది.ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మళ్లీ ఈ ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది.

ఈ సినిమాకి ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా క్రేజ్ ఉంది.అందుకు నిదర్శనంగా కెనెడాలో అభిమానులు వినూత్న రీతిలో సినిమా పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ మాస్‌ బిగెన్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ పేరుతో సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు షేర్‌ చేస్తున్నారు.కొత్త తరహాలో అభిమానులు ఆర్ఆర్ఆర్ సినిమా పేరు ,ఎన్టీఆర్ పేరు కార్లతో రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఇలా వారు ఎన్టీఆర్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

Telugu Jr Ntr, Telugu, Tollywood-Movie

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రూపొందించిన చిత్రం ఆర్ఆర్ఆర్ కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.కెనడాలో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన వీడియోని ఆర్ఆర్ఆర్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

కాగా ఈ నెల 25వ తేదీ ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube