ఆ దర్శకుడు నన్ను బాత్రూం లో వేసి గడియ పెట్టాడు.. ఆ నిజం బయటపెట్టిన ఆర్.పి.పట్నాయక్?

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాగార్జున తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ మన్మధుడుగా అమ్మాయిల మనసులను కొల్లగొట్టాడూ.60 ఏళ్లు దాటుతున్నప్పటికీ అదే ఆనందంతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.ఇక అక్కినేని నాగార్జున హీరోగా నటించిన హిట్ మూవీ లలో సంతోషం కూడా ఒకటి.దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాకు ఆర్పి పట్నాయక్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు.

 Rp Patnaik About Incident Happened To Him Santosham Movie Details, Rp Patnaik, M-TeluguStop.com

ఈ సినిమాకు సంగీతం ప్రాణం పోసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆర్.

పి.పట్నాయక్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన గుర్తు చేసుకున్నారు.ఆర్పీ పట్నాయక్ కంపోజ్ చేసిన గల గల గోదారిలా అనే పాట ఎంత మంచి హిట్ సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ పాటకు పల్లవికి ఏం డాన్స్ కంపోజ్ చేయాలి అనేది నాకు అర్థం కాలేదంటూ రాజు సుందరం షూటింగ్ మొదలు పెట్టలేదు.

ఈ క్రమంలోనే దర్శకుడు ఫోన్ చేయగా నేను లొకేషన్ లోకి వెళ్లాను.షూటింగ్ ఆగిపోవడంతో అంత టెన్షన్ లో ఉన్నారు.ఇక పల్లవి మారిస్తేనే రాజ్ సుందరం మాస్టర్ కంపోజ్ చేస్తానని చెప్పారు.

Telugu Dasarath, Kulasekhar, Nagarjuna, Rajsundaram, Rp Patnaik, Rp Patnayak, Sa

ఇక దర్శకుడు దశరథ్ మొదటి సినిమా కావడంతో ఎంతో టెన్షన్ లో మునిగిపోయారు.దీంతో వెంటనే కులశేఖర్ కి ఫోన్ చేసి వేరే పల్లవి రాయాలని చెప్పాను.అంత సమయం లేదు ఏదో ఒకటి చేయాలని అన్నారు.

అప్పుడే బాత్రూమ్ కి వెళ్ళాను బయటనుంచి దర్శకుడు గడియ పెట్టేసాడు.పల్లవి చెబితేనే డోర్ తీస్తానని బ్లాక్మెయిల్ చేసాడు.

దీంతో దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రాసిచ్చిన అని లైన్ చెప్పాను.ఇక మిగతా లైన్ల అవే వస్తాయి అంటూ అప్పుడు డోర్ తీసి బయటకు రమ్మన్నాడు.

ఈ సినిమాకి పల్లవి రెడీ చేశాం.తర్వాత పాట సూపర్ హిట్ అయింది.

ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube