నెల్లూరు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది.కుళ్లిపోయిన చికెన్ విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులకు కుళ్లిపోయిన చికెన్ భారీస్థాయిలో బయటపడింది.ఈ కుళ్లిన కోడి మాంసం, లివర్ ను చెన్నై నుంచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో 300 కిలోల కోడి లివర్ ను సీజ్ చేశారు.కాగా కుళ్లిన చికెన్ ను ఆరిఫ్ అనే వ్యాపారి చెన్నైలో కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు వ్యాపారి ఆరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.