ఇటీవల సోషల్ మీడియా ద్వారా కొంతమంది తమలోని ప్రతిభను వెలికితీస్తున్నారు.తమ టాలెంట్ ను ఉపయోగించి అనేక విన్యాసాలు చేస్తూ పాపులర్ అవుతున్నారు.
అలాగే తమకు వచ్చిన పనినే కాస్త వినూత్నంగా చేస్తే పాపులారిటీ సంపాదించుకున్నారు.తాజాగా ఒక వ్యక్తి అత్యంత నైపుణ్యంతో రోటీలు తయారుచేస్తున్నాడు.
చాలామంది రోటీలను గాల్లో ఎగరేస్తూ స్ట్రైల్ గా తయారుచేస్తూ ఉంటారు.రుమాల్ రోటీలను( Rumal Rotis ) గాల్లో ఎగరేస్తూ ఉంటారు.
తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో కూడా ఒక వ్యక్తి గాల్లోకి ఎగరేస్తూ రోటీలను తయారుచేస్తున్నాడు.
ఈ వీడియో దాదాపు 18 సెకన్లపాటు ఉండగా.ఈ వీడియోలో ముక్కుకు, మూతికి ట్రాన్స్పరెంట్ మాస్క్ ( Transparent mask )ధరించిన వ్యక్తి చేతికి కాస్త పిండి తీసుకున్నాడు.చేతితో పిండిని వత్తులూ గుండ్రంగా చేశాడు.
ఆ తర్వాత గాలిలో ఎగరేశాడు.అది కాస్త దూరంగా వెళ్లిన తర్వాత మరో వ్యక్తి దగ్గరకు వెళ్లింది.
ఆ వ్యక్తి పట్టుకుంటాడేమోనని అందరూ అనుకున్నారు.కానీ అది తిరిగి మళ్లీ ఆ వ్యక్తి దగ్గరికే వచ్చేసింది.
మళ్లీ తిరిగి వచ్చిన దానిని మునివేళ్లపై గిరగిరా తిప్పుతూ రకరకాల విన్యాసాలు చేశాడు.
కుడిచేతి చూపుడు వేలిపై ఉంచి బాస్కెట్‌బాల్( Basketball ) తిప్పినట్లు తిప్పాడు.అతడి టాలెంట్ చూసి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు.అతడి ప్రతిభను చూసి అభినందిస్తున్నారు.
చప్పెట్లతో అతడి టాలెంట్ ను మెచ్చుకుంటుున్నారు.దీనికి సంబంధించిన వీడియోను టెన్సు యోగే అనే వ్యక్తి ట్విట్టర్ లో సఏర్ చేశాడు.ఈ వీడియోకు 2.2 మిలియన్ల వ్యూస్ ఇప్పటివరు వచ్చాయి.ఈ వీడియోను జూన్ 27వ తేదీన ఉదయం 10 గంటలకు షేర్ చేశారు.షేర్ చేస్తూ ప్రౌడ్ ఆఫ్ యూ అని రాసుకొచ్చాడు.