ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన రోజా రమణి( Roja Ramani ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రోజా రమణి పాపులారిటీ సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.
భక్త ప్రహ్లాద సినిమాలో( Bhakta Prahlada ) బాలనటిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన రోజా రమణి ఒరియా రీమేక్ లలో ఎక్కువగా నటించి ఆకట్టుకున్నారు.ఈతరం ప్రేక్షకులకు హీరో తరుణ్ తల్లిగా ఆమె సుపరిచితం అనే సంగతి తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రోజా రమణి సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో అభిమానం అని ఆమె అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం అదృష్టం అని ఆమె చెప్పుకొచ్చారు.తాతమ్మ కల సినిమాలో తొలిసారి సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించానని రోజా రమణి కామెంట్లు చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ తో నాలుగైదు సినిమాలు చేశానని ఆమె తెలిపారు.
ఒక మూవీ షూటింగ్ లో భాగంగా ఆత్మహత్య చేసుకోవడానికి నేను పరుగెత్తుతుండగా ఆగు చెల్లెమ్మా అంటూ హరికృష్ణ వెనకే వస్తున్నారని ఆ సినిమాకు సీనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ అని రోజా రమణి చెప్పుకొచ్చారు.కృష్ణా బ్యారేజీ రెయిలింగ్ పై ఖాళీ క్యాన్ల మీద నేను నిలబడ్డానని ఆ క్యాన్లు ఊగుతుండటంతో రామారావు వచ్చి నా కాళ్లు పడిపోకుండా పట్టుకున్నారని రోజా రమణి కామెంట్లు చేశారు.
కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అక్కడ సూసైడ్ జరుగుతుందని రోజా రమణి కామెంట్లు చేశారు.వేల సంఖ్యలో జనం ముందు ఏ మాత్రం ఆలోచించకుండా రామారావు కాళ్లు పట్టుకున్నారని రోజా రమణి వెల్లడించారు.రోజా రమణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోజా రమణి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.