జబర్దస్త్ లో అందరూ రోజా కాళ్ల మీద పడినవారే.. రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఏపీ ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత జబర్దస్త్ కమెడియన్లు రోజా( Roja ) ని ఏ రేంజ్ లో విమర్శించారు మనందరికీ తెలిసిందే.

ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు.

మరి ముఖ్యంగా కిరాక్ ఆర్పి( Kiraak RP ) అయితే రోజాని డైమండ్ రాణి అని అంటూ చాలా ఘోరంగా మాట్లాడిన విషయం తెలిసిందే.హైపర్ ఆది( Hyper Adi ) ఇలా చాలామంది జబర్దస్త్ కండియన్స్ రోజా ని మాములుగా ఆడుకోవడం లేదు.

కారణం లేకపోలేదు మెగా హీరోలకి భయపడి జబర్డస్త్ లో కామెడీ చేసుకునేవారంతా జనసేనకు జై కొట్టారంటూ రోజా కూడా కమెడియన్స్ పై కామెంట్స్ చేసింది.

దాంతో ఆ మాటలకు రెచ్చిపోయిన జబర్దస్త్ కమెడియన్స్ రోజాపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.అయితే ఇప్పుడు కమెడియన్స్ జనసేన తరపున ప్రచారం చేసిన వారంతా 2024 ఎన్నికల్లో గెలవడం, రోజా ఓడిపోవడంతో ఆమె కామ్ అవ్వగా, కమెడియన్స్ కూడా ఎవరికీ వారు తమ తమ పనులు చేసుకుంటున్నారు.తాజాగా జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) మాట్లాడుతూ.

Advertisement

జబర్దస్త్ లో ఉన్నప్పుడు రోజా వలన చాలామంది లాభపడ్డారు.అందరూ ఆవిడ కాళ్ళ మీద పడినవారే, ఒంగి ఒంగి నమస్కారాలు చేసారు.

ఆవిడ అందరికి సహాయం చేసింది.

కానీ రాజకీయాలకొచ్చేసరికి అందరూ రోజా గారికి యాంటీ అయ్యారు.రోజా గారిని అన్నన్ని మాటలనాల్సిన అవసరం లేదు.ఆవిడ వలన జబర్దస్త్ లో( Jabardasth ) లాభపడిన వారే ఎక్కువగా ఉన్నారు.

ఎవ్వరు ఏది మొదలు పెట్టినా రోజా గారు వెళ్లి వాళ్ళని ఆ శీర్వదించేవారు.ఆర్పీ కూడా నెల్లూరు చేపల పులుసు ఓపెనింగ్ కి ఆవిడని పిలిచాడు.రోజా vs జబర్దస్త్ కమెడియన్స్ పై రాకింగ్ రాజేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ప్రస్తుతం రాకేష్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఆ మాటలను ఏకీభవిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు