తమిళ సినీ నటుడు రోబో శంకర్( Robot Shankar ) ఇంట పెళ్లి సంబరాలు మొదలుకానున్నాయి.రోబో శంకర్ కూతురు ఇంద్రజ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది.
ఇంద్రజ ( indraja )అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ ఈ తమిళ హీరో విజయ్ నటించిన విజిల్( Whistle ) సినిమాలో గుండమ్మ పాత్రలో నటించిన కమెడియన్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.ఈ సినిమాతో ఒక్కసారిగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది ఇంద్రజ.
ఇది ఇలా ఉంటే తాజాగా ఇంద్రజ తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేస్తూ కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలో ఆమె కాబోయే భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.అందరూ కలిసి ఏదో దేవాలయానికి వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఇంద్రజ కు కాబోయే భర్త మరెవరో కాదు డైరెక్టర్ శంకర్.
ఇంద్రజ తరచూ రీల్స్ చేస్తూ వస్తోంది.అతనితోనే ఏడడుగులు వేయనున్నట్లు ఆమె తెలిపింది.
ఆ ఫోటో లను చూసిన నెటిజన్స్ మీరు పెళ్లి చేసుకున్నారా? అని అడిగగా.వెంటనే ఇంద్రజ స్పందిస్తూ.
పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదని, ఆ పని పూర్తవగానే త్వరలోనే వెడ్డింగ్ డేట్ చెప్తాను అని తెలిపింది.కాగా ఇంద్రజ తమిళంలో విజయ్ నటించిన బిగిల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో విడుదల అయింది.ఈ సినిమాలో ఫుట్బాల్ పాండియమ్మగా నటించి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.ఎప్పుడు తింటూ ఉండడంతో విజయ్ ఆమెను ఆటపట్టి ఉంటాడు.ఆ తర్వాత ఆమె సర్వైవర్( Survivor ) అనే షోలోనూ పాల్గొంది.ప్రస్తుతం ఆమె కార్తీ విరుమాన్ సహా పలు సినిమాలతో బిజీగా ఉంది ఇంద్రజ.ఆమె తండ్రి రోబో శంకర్ కళక్క పోవదు యారు, అడు ఏడు ఈడు వంటి కామెడీ షోలలో మెరిశాడు.
ఇదర్కు తానే ఆశైపట్టై బాలకుమార, వేలైను వందుత వేళ్లైకారన్, ఇరుంబు తిరై, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు.