ఉలిక్కిపడిన అమెరికా మరోసారి కాల్పులు..!

అమెరికాలో వరుస కాలుపులు అక్కడ ప్రజలని భయబ్రాంతులకి గురిచేస్తున్నాయి.ఒక దుండగుడు జరిపిన కాల్పులలో సుమారు 11 మంది అక్కడికక్కడే చనిపోయారని అమెరికా పోలీసులు ట్విట్టర్ లో వెల్లడించారు.

 Robert Bowers What To Know About Pittsburgh Synagogue Shooting-TeluguStop.com

గెడ్డంతో ఉన్న శ్వేతజాతీయుఏడు ఒకరిని ఈ ఘటనకు సంబంధించి అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు.అక్కడి చానెల్స్ ప్రకారం చూస్తే యూదులు అందరూ చనిపోవాలి అని అరుస్తూ లోనికి జొరబడి కాల్పులు జరిపినట్లు చెపుతున్నారు.

అయితే వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసు అధికారులు కాల్పులు జరుగకుండా అడ్డుకున్నారు.ఈ ఘటనలో ముగ్గురు అధికార్లు సైతం గాయపదినట్లుగా తెలుస్తోంది.పెన్సిల్వేనియా గవర్నర్‌ టామ్‌ వోల్ప్‌ మాట్లాడుతూ వెనువెంటనే తక్షణ సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.పిట్స్‌బర్గ్‌ మెడికల్‌ కేంద్రంలో క్షతగాత్రులందరికి చికిత్స చేస్తున్నారు.

అయితే ఈ దుండగుడు జరిపిన కాల్పులలో ఎక్కువ మంది క్షతగాత్రులు ఉన్నారని , పిట్స్‌బర్గ్‌ పోలీస్‌ కమాండర్‌ వెల్లడించారు.స్థానిక నివాసితులెవ్వరూ బైటికి రావద్దని ముందుగానే హెచ్చరించారు.ఈ దాడికి పాల్పడింది 46 ఏళ్ల రాబర్ట్ బోవర్స్‌గా గుర్తించారు.అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాల్పుల్లో గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube