తిరుపతి -లింగంపల్లి డెక్కన్ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు.కడప జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రయాణికుల నుంచి నగలు, నగదును అపహరించుకుని వెళ్లారు కొందరు కేటుగాళ్లు.అనంతరం కమలాపురం -ఎర్రగుంట్ల మధ్య రైలు ఆపి దొంగలు పరారైయ్యారు.కాగా, మొత్తం 28 గ్రాముల బంగారం నగలు, రూ.9 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.రైలులో ఇటువంటి చోరీ ఘటన జరగడంతో ప్రజలు ఒక్క సారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.