బాధను దిగమింగుకుని నాన్న శవంపై అలా ప్రామిస్ చేశానన్న రీతూ.. ఏమని ప్రామిస్ చేశారంటే?

Rithu Chowdary Emotional Comments About Father Details Here Goes Viral , Ritu Choudhary, Father Details, Youtube, Celebrities, Instagram

సీరియళ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న వాళ్లలో రీతూ చౌదరి( Ritu Choudhary ) ఒకరు.రీతూ చౌదరి టాలెంట్ కు మరింత గుర్తింపు దక్కితే ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

 Rithu Chowdary Emotional Comments About Father Details Here Goes Viral , Ritu-TeluguStop.com

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రీతూ చౌదరి షాకింగ్ విషయాలను వెల్లడించారు.బాధను దిగమింగుకుని నాన్న శవంపై ప్రామిస్ చేశానని ఆమె చెప్పుకొచ్చారు.

చనిపోవడానికి ముందురోజు నాన్న చాలా యాక్టివ్ గా ఉన్నారని యూట్యూబ్( Youtube ) లో యాక్టివ్ గా ఉండాలని సూచనలు చేశారని ఊరి గురించి ఒక వ్లాగ్ చేయాలని కోరారని రీతూ చౌదరి అన్నారు.రాత్రంతా ఎన్నో విషయాలు మాట్లాడిన నాన్న తెల్లవారే సమయానికి మరణించారని తెలిసి తట్టుకోలేకపోయానని రీతూ చౌదరి కామెంట్లు చేశారు.

నాన్న చివరి క్షణాలను నేను చూడలేదని చెబుతూ రీతూ చౌదరి ఎమోషనల్ అయ్యారు.

Telugu Ritu Choudhary, Youtube-Movie

ఫస్ట్ శాలరీతో కొన్న కారులో నాన్న శవాన్ని తీసుకొనిరావడం జరిగిందని ఆ కారులో ఎప్పుడు కూర్చున్నా నాన్న నాతో ఉన్నారనే భావన కలిగిందని రీతూ చౌదరి వెల్లడించారు.నాన్న మరణాన్ని అన్నయ్య జీర్ణించుకోలేకపోయాడని రీతూ చౌదరి కామెంట్లు చేశారు.కుటుంబ బాధ్యతలను తీసుకుంటానని చెబుతూ నాన్న శవంపై నేను ప్రామిస్ చేశానని రీతూ చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Ritu Choudhary, Youtube-Movie

రీతూ చౌదరికి ఇన్ స్టాగ్రామ్ లో 9,92,000 ఫాలోవర్లు ఉన్నారు.త్వరలో 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీల ( Celebrities )జాబితాలో రీతూ చౌదరి చేరే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.రీతూ చౌదరి సినిమాలపై దృష్టి పెడితే ఆమె కెరీర్ మరింత పుంజుకుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.రీతూ కెరీర్ ను రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube