Rishabh Shetty : వామ్మో.. కాంతార2 కోసం రిషబ్ శెట్టి అన్ని రూ.కోట్ల పారితోషికం తీసుకోనున్నారా?

కన్నడ హీరో రిషబ్ శెట్టి( Rishabh Shetty ) హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార.( Kantara ).గత ఏడాది చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.మొదట కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.

 Rishab Shetty Remuneration For Kantara 2-TeluguStop.com

కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో అత్యధిక కలెక్షన్లను సాధించింది.ఇకపోతే కాంతార 2 కోసం కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాంతార 2 ఉంటుందని ఇప్పటికే హోంబలే వ్యవస్థాపకుడు విజయ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక ఆ సంగతి పక్కన పెడితే కాంతార 2( Kantara 2 ) సినిమాకు గాను హీరో రిసెప్ట్ శెట్టి తీసుకుంటున్నా పారితోషికం విషయం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మొదట కాంతార 1 కీ రిషబ్ శెట్టి కేవలం ఐదు కోట్లు మాత్రమే తీసుకోగా చిన్న సినిమాగా విడుదలైన సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించడంతో కాంతార 2 కీ భారీగా పారితోషికం పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాంతార 2 పదుల్లో కాకుండా ఏకంగా వందల్లో డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాంతార 2 సినిమా కోసం రిషబ్ శెట్టి దాదాపుగా 100 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే కన్నడ హీరో యష్ ని మించిపోయాడని చెప్పవచ్చు.ఈ వార్త విన్న నెటిజన్స్ 5 కోట్లు ఎక్కడ 100 కోట్లు ఎక్కడ ఒక్క సినిమా ఇంత తేడానా అంటూ షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube