ఓడే మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించిన రింకూ సింగ్.. చివరి ఓవర్లో మ్యాచ్ కీలక మలుపు..!

ఐపీఎల్ లో ఆడే జట్లలో బలహీనమైన జట్టు గా కలకత్తా జట్టు ఉండేది.ఎందుకంటే ఈ సీజన్లో పంజాబ్ చేతిలో ఘోరంగా ఓడింది.

తర్వాత ఊపందుకొని తమ సత్తా ఏంటో చూపించింది.బెంగుళూరు తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లు అద్భుతంగా ఆడి కలకత్తా జట్టును గెలిపించారు.

ఇక తాజాగా జరిగిన గుజరాత్- కలకత్తా ( Kolkata Knight Riders )మధ్య మ్యాచ్లో కలకత్తా ఓడిపోతుందని అనుకున్నారు.అయితే చివరి బంతి వరకు సాగిన మ్యాచ్లో ఒంటిచేత్తో రింకూ సింగ్ కలకత్తా జట్టును గెలిపించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.ఇందులో విజయ శంకర్ 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్ లతో 63 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

Advertisement

సాయి సుదర్శన్ 38 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కలకత్తా జట్టు ఆట ప్రారంభంలో కాస్త తడబడింది.అయితే ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్( Venkatesh Iyer ) 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్ లతో 83 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.కలకత్తా జట్టు కెప్టెన్ నితీష్ 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్ లతో 45 పరుగులు చేశాడు.

కలకత్తా జట్టు 100 పరుగులు చేసేలోపు మూడు కీలక వికెట్లను కోల్పోయింది.ఇక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతూ చివరి ఓవర్ లో కలకత్తా జట్టు గెలవాలంటే 29 పరుగులు చేయాల్సి ఉంది.

మామూలుగా అయితే ఒక ఓవర్లో 29 పరుగులు చేయడం చాలావరకు అసాధ్యం.అయితే రింకూ సింగ్( Rinku Singh ) అద్భుతం చేశాడు.యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో మొదటి బంతికి ఉమేష్ యాదవ్ సింగల్ తీసుకొని రింకూ సింగ్ కు స్ట్రైక్ ఇచ్చాడు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ఇక రింకూ సింగ్ వరుసగా 5 సిక్సులు బాదాడు.ఓడిపోయే మ్యాచ్ చివరి ఓవర్ లో మలుపు తిరిగి ఘనవిజయం అందుకుంది.రుంకూ సింగ్ 21 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి కలకత్తా జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

Advertisement

తాజా వార్తలు