మెగా డాటర్ నిహారిక( Niharika ) భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యతో( Venkata Chaitanya ) విడాకులు తీసుకోబోతోందని గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా వీరి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఎవరు కూడా ఈ విషయంపై ఖండించలేదు.
ఇకపోతే నిహారిక వెంకట చైతన్య ఇద్దరు కూడా ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా వీరిద్దరి పెళ్లి ఫోటోలను కూడా ఇద్దరూ డిలీట్ చేసేసారు.ఇలా పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని విడాకులు(Divorce) తీసుకోబోతున్న తరుణంలోనే ఇలా పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు అంటూ అందరూ భావించారు.
ఇలా చైతన్య నిహారిక ఇద్దరు విడాకులు తీసుకోబోతున్న తరుణంలో ఈమె కూడా తన భర్త బాటలోనే పయనిస్తూ ఇంస్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేశారు.అయితే కేవలం ఒక ఫోటోని మాత్రమే ఉంచారు.పెళ్లి మండపంలో చైతన్య పక్కన కూర్చుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు అయితే ఇందులో వెంకట చైతన్య ఫోటో కాస్త బ్లర్ చేసి ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా దగ్గర ఓ రహస్యం ఉంది.
కానీ మీకు చెప్పేస్తే అది రహస్యం ఎలా అవుతుంది.సారీయే చెప్పలేను అనే క్యాప్షన్ కూడా పెట్టారు.
ఇలా ఈ ఒక్క ఫోటోని మాత్రమే ఉంచి మిగతా ఫోటోలను డిలీట్ చేశారు.అయితే ఇది చూసిన నెటిజన్స్ ఈ ఒక్క ఫోటో కూడా ఎందుకు పెట్టావు అది కూడా డిలీట్ చేసేయొచ్చుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇలా వీరి వ్యవహార శైలి వీర ప్రవర్తన కనుక చూస్తుంటే తప్పకుండా వీరు విడాకులు తీసుకోబోతున్నారని ఊహగానాలు బలమవుతున్నాయి.మరి నిహారిక చైతన్య గురించి వస్తున్నటువంటి ఈ విడాకుల వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలి అంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది.