ఒకప్పుడు మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ సినిమాలన్నీ ప్లాప్ అవడమే కాకుండా అన్ని బి గ్రేడ్ సినిమాలు తీస్తూ వస్తున్నాడు.
అలాగే వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరో ఒకరి మీద కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.
అవసరం ఉన్నా లేకపోయినా అన్ని విషయాల్లో స్పందిస్తూ తనదైన శైలిలో మాటలు తూటాలుగా సంధిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఈయన ఏం చేసిన అందరు మాట్లాడుకునే విధంగా చేస్తాడు.అది మాత్రం పక్కా.ఈయన చేసే చిత్ర విచిత్రమైన పనుల వల్ల ఈయన తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.తాజాగా మరోసారి వర్మ వార్తల్లో నిలిచాడు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మీద కామెంట్స్ చేసి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యాడు.
ఆర్జీవీ మెగా ఫామిలీ గురించి ఎప్పుడు మాట్లాడిన అది సెన్సేషనల్ గా మారడం ఖాయం.

మరోసారి వర్మ మెగా ఫ్యామిలీ పై కామెంట్స్ చేసాడు.ప్రెసెంట్ ఆచార్య సినిమా నుండి 4వ పాట రిలీజ్ చేస్తున్నట్టు చెప్పడానికి చిరు, చరణ్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పోస్ట్ చేసిన విషయం విదితమే.ఈ వీడియోలో తండ్రీకొడుకులు డ్యాన్స్ గురించి మాట్లాడుతూ.తగ్గను, తగ్గేదే లే అని సంబాషించు కున్నారు.

ఈ వీడియోపై వర్మ కామెంట్ చేసారు.”నేను మెగా హార్ట్ అయ్యాడు.చిరంజీవి, చరణ్ తగ్గను.తగ్గేదేలే అని అల్లు అర్జున్ డైలాగ్స్ వాడుతుంటే.చిరు, చరణ్ బన్నీ న్యూ మెగా హీరో అని రుజువు చేసినట్టు ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.ఈ కామెంట్ చూసిన మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతున్నారు.







